న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోపాన్ని ఆపుకోలేక అంఫైర్‌ను బంతితో కొట్టాడు

డేవిస్ కప్ టోర్నీలో ఓ టెన్నిస్ ఆటగాడి భావోద్వేగం ఛైర్‌ అంపైర్‌ను గాయపర్చింది. కెనడా టెన్నిస్ స్టార్ డెనిస్ షపోవాలవ్ తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేక బంతితో అంపైర్‌ను బలంగా కొట్టిన ఘటన డేవిస్ కప్‌లో చోటు

By Nageshwara Rao

హైదరాబాద్: డేవిస్ కప్ టోర్నీలో ఓ టెన్నిస్ ఆటగాడి భావోద్వేగం ఛైర్‌ అంపైర్‌ను గాయపర్చింది. కెనడా టెన్నిస్ స్టార్ డెనిస్ షపోవాలవ్ తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేక బంతితో అంపైర్‌ను బలంగా కొట్టిన ఘటన డేవిస్ కప్‌లో చోటు చేసుకుంది. కెనడా-గ్రేట్‌ బ్రిటన్‌ మధ్య జరిగిన పోరులో రెండు జట్లు 2-2తో సమానంగా నిలిచాయి.

ఫలితాన్ని నిర్ణయించే ఆఖరి సింగిల్స్‌‌లో మూడో సెట్‌లో షపోవాలవ్ 1-2తో వెనుకంజలో ఉన్న సమయంలో ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. ఈ క్రమంలో పాయింట్ రాకపోవడంతో డెన్నిస్‌ షపొవలొవ్‌ అతిగా స్పందించి బంతిని అంపైర్ గబాస్ కూర్చొన్న స్టాండ్ వైపు గట్టిగా కొట్టాడు.

ఆ బంతి ఛైర్‌ అంపైర్‌ గబాస్ ఎడమ కంటికి బలంగా తాకడంతో అతడు విలవిల్లాడిపోయాడు. దీంతో తొలుత అతనికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం అతడిని ఒట్టావాలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత తన ప్రవర్తన పట్ల షపొవలొవ్‌ క్షమాపణలు చెప్పినట్లు అంఫైర్ గబాస్ వెల్లడించాడు.

Tennis: Umpire hit by ball in the face as player smashes it out of frustration

అయితే అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య మాత్రం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. ఒక మ్యాచ్‌ అధికారిని నిర్లక్ష్యంగా వ్యవహరించి బంతితో కొట్టడం తప్పుగా అభివర్ణిస్తూ అతనికి 7 వేల డాలర్ల జరిమానా వేసింది. అనంతరం డేవిస్ కప్ నుంచి షపొవలొవ్‌‌ను బహిష్కరించారు.

ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఛైర్ అంపైర్ గబాస్ ఎడమ కన్నుపై తీవ్రంగా వాచినట్లు కెనడా డేవిస్ కప్ సభ్యుడొకరు తెలిపారు. 17 ఏళ్ల షపొవలొవ్‌ 2016లో జూనియర్‌ వింబుల్డన్‌ టైటిల్‌ కూడా గెలుచుకున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X