న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ కప్ ఫైనల్‌‌: వివాదాస్పద అంపైర్ అలీం దార్‌కు దక్కని చోటు

By Nageswara Rao

మెల్‌బోర్న్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మెల్ బోర్న్‌లో మార్చి 29న జరగనున్న పైనల్ మ్యాచ్‌కి అంపైర్ల పేర్లను ప్రకటించింది. క్వార్టర్ ఫైనల్‌లో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్బంగా నో బాల్ వివాదాన్ని ఎదుర్కొంటున్న పాకిస్ధాన్ అంఫైర్ అలీం దార్‌ను ఫైనల్‌ మ్యాచ్‌కు ఎంపిక చేయలేదు.

వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు ఆతిథ్య దేశాలైన న్యూజిలాండ్, అస్టేలియా మధ్య ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న మ్యాచ్‌కి అధికారులను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. గతంలో ఐసీసీ నుంచి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న పాకిస్దాన్ అంఫైర్ అలీం దార్‌ను సెమీ పైనల్‌కు కూడా ఐసీసీ దూరంగా పెట్టింది.

ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా మార్చి 19(గురువారం)న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్ Vs బంగ్లాదేశ్ మధ్య రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పవర్ ప్లేలో టీమిండియా అద్భుతంగా రాణిస్తుండగా, బంగ్లా బౌలర్ రుబెల్ వేసిన 40వ ఓవర్‌లో పుల్ టాస్ బంతిని రోహిత్ శర్మ డీప్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడాడు.

Umpires named for World Cup final, no place for Aleem Dar after controversy

బంతి ఫీల్డర్ చేతిలో పడింది. బంగ్లా ఆటగాళ్లు సంబరాలకు సిద్ధమవుతుండగానే.... మైదానంలో ఉన్న అంఫైర్ అలీమ్ దార్ నో బాల్ ఇచ్చాడు. ఐతే బంతి నడుము కంటే తక్కువ ఎత్తులోనే వెళ్తున్నట్లు రీప్లేలో తేలింది. అప్పటికే రోహిత్ శర్మ 90 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎదుర్కొన్న 24 బంతుల్లో రోహిత్ శర్మ 46 పరుగులు చేశాడు.

మార్చి 29- ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ - మ్యాచ్ అఫీషియల్స్

రంజన్ మదుగలే (మ్యాచ్ రిఫరీ)

కుమార ధర్నసేన, రిచర్డ్ (మైదానపు అంఫైర్లు)

మారియస్ ఎరాస్మస్ (థర్డ్ అంఫైర్)

ఇయాన్ గోల్డ్ (ఫోర్త్ అంపైర్)

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X