న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లి, అనుష్క సెకండ్ ఇన్నింగ్స్.. ప్రేమ కథలో మరో మలుపు

బ్రేకప్‌ కి బ్రేక్ వేసి పాత ప్రేమనే మళ్లీ కొత్తగా మొదలుపెట్టబోతున్నారట క్రేజీ లవ్ బర్డ్స్ విరాట్ కోహ్లి-అనుష్క శర్మ. 'ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా.. అంతంత దూరం నేను నీతో రానా..' అన్న తరహాలో ఇన్నాళ్ల దూరానికి ఫుల్ స్గాప్ పెట్టి మళ్లీ చెట్టాపట్టాలేసుకుని తిరగడానికి సిద్దమైపోయారట ఈ ప్రేమజంట.

నిన్నటిదాకా ఇద్దరి మధ్య ఏర్పడిన బ్రేకప్ పై వార్తలు షికారు చేస్తే.. ఇప్పుడు వీళ్లిద్దరి సెకండ్ ఇన్నింగ్స్ లవ్ పై ఛానెళ్లు బ్రేకింగ్ న్యూస్ తరహాలో పండగ చేసుకుంటున్నాయి. విరాట్ పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తే.. కెరీర్ కోసం అనుష్క ఆ ప్రపోజల్ ని తిరస్కరించిందని దాంతో ఇద్దరు విడిపోయారని మీడియా కోడై కూసిన విషయం తెలిసిందే.

virat khol and anushka second innings in their love

ఇదిలా ఉంటే నిన్న రాత్రి ఇద్దరూ కలిసి ఓ డిన్నర్ లో దర్శనమివ్వడంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చిందన్న వార్త హల్-చల్ చేస్తోంది. దీనికి బలాన్ని చేకూరుస్తూ.. తాజాగా మళ్ళీ ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో అనుష్కను ఫాలో అవడం మొదలుపెట్టాడు కోహ్లి.

కాగా.. ఇద్దరు విడిపోయాక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో అనుష్కను కోహ్లి 'అన్ ఫాలో' చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ నిజమేనని అభిప్రాయపడుతున్నారు పలువురు. మే 1వ తేదీ అనుష్క పుట్టినరోజు కూడా కావడంతో కోహ్లి అనుష్కకు బర్త్ డే గిఫ్ట్ ఇలా ప్లాన్ చేశాడనే వాదనలు వినిపిస్తున్నాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X