న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ గడ్డపై సచిన్, గవాస్కర్‌ల రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ

By Nageswara Rao

సిడ్నీ: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించిన విరాట్ కోహ్లీ పరుగుల వేటలో బ్యాటింగ్ దిగ్గజాలైన సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహల్ ద్రవిడ్‌లను అధిగమించాడు.

ఆస్టేలియా గడ్డపై జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరిస్‌లో ఆఖరి టీ20 మ్యాచ్ ఆదివారంలో సిడ్నీలో జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన అర్ధశతకంతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరిస్‌లో విరాట్ కోహ్లీ వరుసగా మూడు అర్ధసెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఆస్టేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ సాధించిన 7వ అర్ధ శతకం ఇది. ఒక భారత్ బ్యాట్స్‌మెన్‌కు ఇదొక కొత్త మార్క్. ఆస్టేలియా పర్యనటలో అన్ని ఫార్మెట్లలో విరాట్ కోహ్లీ ఆరు అర్ధ సెంచరీలు సాధించాడు. గతంలో ఈ రికార్డు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లు సాధించారు.

Virat Kohli breaks Sunil Gavaskar, Sachin Tendulkar records in Australia

వన్డే సిరిస్‌లో టీమిండియా 1-4 తేడాతో పరాజయం పాలైనప్పటికీ కోహ్లీ మాత్రం అద్భుతమైన ప్రదర్శనను కనబర్చాడు. వన్డే సిరిస్‌లో విరాట్ కోహ్లీ వరుసగా 91, 59, 117, 106, 8 పరుగులు చేశాడు. ఇక టీ20 సిరిస్ విషయానికి వస్తే తొలి మ్యాచ్‌లో 90 నాటౌట్, రెండో మ్యాచ్‍‌లో 59 నాటౌట్, మూడో మ్యాచ్‌లో 50 పరుగులు సాధించాడు.

అంతేకాదు టీ20 సిరీస్‌లో మొత్తంగా చూస్తే 199 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఈ ఆస్టేలియా పర్యటనలో కోహ్లీ మరో రికార్డుని తన ఖాతలో వేసుకున్నాడు. అదేంటంటే 50 ఓవర్ల ఫార్మెట్‌లో అత్యంత వేగంగా 7,000 పరుగుల మైలు రాయిని చేరుకోవడమే.

ఆస్ట్రేలియా పర్యనటలో ఆసీస్‌పై 50కి (అన్ని ఫార్మెట్లలో) పైగా పరుగులు సాధించిన ఆటగాళ్లు:

7 - Virat Kohli (580 runs in 8 innings) - 2015-16 season
6 - Sunil Gavaskar (700 in 11 innings) - 1985-86, Sachin Tendulkar (762 in 14 innings) - 2007-08
5 - Murali Vijay (482 in 8 innings) - 2014-15, GR Viswanath (473 in 9 innings) - 1977-78, Kohli (705 in 11 innings) - 2014-15, VVS Laxman (749 in 13 innings) - 2003-04, Rahul Dravid (746 in 14 innings) - 2003-04

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X