న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ క్రికెట్ విక్టరీలపై నీళ్లు: పిచ్‌లపై పాక్ మాజీ పేసర్ వ్యాఖ్యలు

By Pratap

కరాచీ: భారత హ్యాట్రిక్ విజయాలపై పాకిస్తాన్ మాజీ పేసర్ సర్ఫరాజ్ నవాజ్ నీళ్లు చల్లే ప్రయత్నాలు చేశారు. ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో క్రికెట్ అభిమానులు భారత క్రికెటర్ల ఆటతీరుపై ప్రశంసలు కురిపిస్తుంటే ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి ఐసిసి భారత్‌కు అనుకూలించే విధంగా పిచ్‌లను తయారు చేయించిందని ఆయన ఆరోపించారు.

ప్రపంచ కప్ పోటీల్లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచులను చూస్తే భారత్ ఆడిన మైదానాల్లోని పిచ్‌లను ఆ జట్టుకు అనుకూలించే విధంగా రూపొందిచారని అర్థమవుతోందని అన్నారు. ఓ టీవీ చానెల్ షోలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌కు అంతగా సులభంగా లోని పిచ్‌లపై తమ ఆటగాళ్లు ఆడాల్సి వచ్చిందని ఆయన పాకిస్తాన్ జట్టును సమర్థించే ప్రయత్నం చేసారు

WC 2015: ‘ICC is favouring India by providing tailor-made pitches’

ఆదివారం పాకిస్తాన్, జింబాబ్వేకు మధ్య జరిగిన మ్యాచు చూస్తే పిచ్‌లను డబుల్ పేస్డ్‌గా తయారు చేశారని, ఎంతో బౌన్స్ లభించే విధంగా తయారు చేశారని, ఇది పాకిస్తాన్ బలానికి తగింది కాదని ఆయన అన్నారు. ఆ విషయాన్ని ఐసిసికి నివేదించి, ప్రస్తుత పోటీల్లో ఏం జరుగుతుందో చూడాలని ఆయన పాకిస్తాన్ క్రికెట్‌ బోర్డును కోరారు.

క్రికెట్ ప్రపంచ పాలనా సంస్థ భారత్‌కు పూర్తిగా అనుకూలంగా వ్యవహరించడంపై పాకిస్తాన్ ఐసిసికి ఫిర్యాదు చేయాలని ఆయన పిసిబికి సూచించారు కాగా, ఈ షోలోని ప్యానెల్‌లో ఉన్న సయీద్ అజ్మల్ ఆ వ్యాఖ్యలపై మాట్లాడడానికి నిరాకరించారు. సవాల్ విసిరే మైదానంపై జింబాబ్వేపై పాకిస్తాన్ గెలువడం మంచి పరిణామమని ఆయన అన్నారు. ఇదే భారత జట్టు ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు మ్యాచుల్లో, వన్డే సిరీస్‌లో తీవ్రంగా దెబ్బ తిన్న విషయాన్ని సర్ఫరాజ్ నవాజ్ గుర్తు చేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X