న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌పై ఆరోవాడిగా 'సెంచరీ' స్మిత్ రికార్డ్, ఫించ్‌పై ధోనీ అప్పీల్ వృథా

By Srinivas

సిడ్నీ: సెమీ ఫైనల్లో భాగంగా గురువారం నాడు భారత జట్టు పైన ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ సెంచరీతో చెలరేగాడు. ప్రపంచ కప్‌లో భారత జట్టు పైన సెంచరీ చేసిన ఆసిస్ ఆటగాళ్లలో ఇతను ఆరోవాడు. భారత్ పైన సెంచరీతో.. స్మిత్ నాలుగో శతకం సాధించాడు.

1983 నుండి ఇప్పటి వరకు భారత జట్టు పైన ప్రపంచ కప్‌లలో ఆసిస్ తరఫున ఐదుగురు సెంచరీలు చేశారు. స్మిత్ ఆరోవాడు. 1983లో ట్రివెర్ చాపెల్, 1987లో గోయెఫ్ మార్ష్, 1996లో మార్క్ వా, 2003లో రికీ పాంటింగ్, 2011లో రికీపాంటింగ్‌లు భారత జట్టు పైన సెంచరీలు చేశారు. ఇప్పుడు స్మిత్ చేశాడు.

స్మిత్ టెస్ట్ సిరీస్ అప్పటి నుండి భారత జట్టు పైన అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. సెమీ ఫైనల్లో అతను 93 బంతుల్లో 105 పరుగులు చేశాడు. అందులో 11 ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. అనంతరం ఉమేష్ యాదవ్ బౌలింగులో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

WC 2015: India's nemesis Steve Smith scores Aus's 6th ton vs India in WC

డేవిడ్ వార్నర్ (12) అవుటైన తర్వాత ఆరోన్ ఫించ్‌కు స్మిత్ తోడయ్యాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 182 పరుగులు జోడించారు. భారత్ పైన ప్రపంచ కప్‌లలో ఆసిస్‌కు రెండో వికెట్‌కు ఇదే అత్యుత్తమ రికార్డ్. గత బెస్ట్ 144 పరుగులు. 1983లో ట్రివెర్ చాపల్, కిమ్ హ్యూగ్స్ 144 పరుగులు రెండో వికెట్‌కు చేశారు. ఈ ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. ఫించ్ (135 ఇంగ్లాండ్ పైన), డేవిడ్ వార్నర్ (178 ఆఫ్ఘనిస్తాన్ పైన), మాక్స్‌వెల్ (102 శ్రీలంక పైన) ఉన్నాయి.

ఆరోన్ ఫించ్...

ఆరోన్ ఫించ్ 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బీ ప్రమాదం నుండి బయటపడ్డాడు. జడెజా వేసిన 23వ ఓవర్ 3వ బంతికి ఫించ్ ఎల్బీగా అవుటయ్యే అవకాశం ఉండగా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అవుట్ పైన ధీమాగా ఉన్న జడెజా, ధోనీ రివ్యూ కోరారు. రివ్యూలో ఫించ్ అవుట్‌గా కనిపించినప్పటికీ నాటౌట్‌గా తేల్చారు. దీంతో భారత ఆటగాళ్లు నిరాశకు గురయ్యారు. ఫించ్ 116 బంతుల్లో 81 పరుగులు చేశాడు. టీమిండియాకు రివ్యూ అవకాశం ఒకటి వృథా అయింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X