న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రో సలహా: గడ్డం తీసేయడం డీ విల్లీర్స్‌కు కలిసొచ్చిందా?

By Pratap

పెర్త్:అబ్రహం డీ విల్లీర్స్ ప్రపంచ కప్ పోటీల్లో దంచి కొడుతున్నాడు. క్రీజులోకి ఫ్యాషన్‌గా అతను ప్రవేశిస్తాడు. అయితే, ఈసారి కొత్త అవతారంలో కనిపించాడు. గడ్డం తీసేసి మైదానంలోకి దిగాడు. న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ మార్టిన్ క్రో ఇచ్చిన సలహాలను అతను పాటించినట్లు ఉన్నాడు. తన కాలమ్‌లో మార్టిన్ క్రో డీ విల్లీర్స్‌కు సలహా ఇస్తూ కొన్ని వాక్యాలు రాశాడు.

ఎబీ, షేవ్ చేసుకో, నువ్వు చింపిరిగా, వొదురుబోతుగా కనిపిస్తున్నావు. స్మార్ట్‌గా తయారు కా.. పాలిష్ చేసుకోవడం అవసరం అని మార్టిన్ క్రో రాశాడు. అయితే, ఈసారి డివిల్లీర్స్ గడ్డం చేసుకుని శుభ్రంగా కనిపించాడు. మార్టిన్ క్రో సలహాను తాను పాటించాడా అనేది అతను చెప్పలేదు. డివిల్లీర్స్ శుక్రవారంనాడు వెస్టిండీస్‌పై 66 బంతుల్లో 162 పరుగులు చేశాడు. 17 ఫోర్లు, 8 సిక్స్‌లు బాదాడు. బ్యాట్స్‌మన్‌గా మరోసారి రికార్డులు సృష్టించాడు.

 WC 2015 SA vs WI: Clean-shaven look brought luck to AB de Villiers?

చాలా సంతోషకరమైన ఆట ఆడానని, పునాదులు వేయడం తనకు కలిసి వచ్చిందని మ్యాచ్ తర్వాత డివిల్లీర్స్ చెప్పాడు. తన పద్ధతిలో తాను ఆడానని, అక్కడా ఇక్కడా కొంత అదృష్టం కలిసి వచ్చిందని అన్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన డీవిల్లీర్స్, రిలీ రస్పో స్మార్ట్‌గా మైదానంలోకి దిగారు. డేల్ స్టెయిన్ ముఖంలో కూడా నవ్వు కనిపించింది.

వన్డేల్లో అత్యంత వేగంగా డీవిల్లీర్స్ 150 పరుగులు చేశాడు. డివిల్లీర్స్ 64 బంతుల్లో 150 పరుగులు చేశాడు. గతంలో ఇది షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా) పేర ఉంది. 2011లో బంగ్లాదేశ్ పైన 83 బంతుల్లో 150 పరుగులు చేశాడు. అలాగే 16 బంతుల్లో 50 పరుగులు, 31 బంతుల్లో 100 పరుగుల రికార్డ్ కూడా సృష్టించాడు. రెండో వేగవంతమైన ప్రపంచక కప్ సెంచరీ ఇది. 52 బంతుల్లో సెంచరీ చేశాడు. గతంలో కెవిన్ ఓ బ్రెయిన్ (ఐర్లాండ్) 50 బంతుల్లో సెంచరీ చేశాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X