న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్: 4 సెంచరీలు... 5వ స్ధానం నుండి నెంబర్ వన్ స్ధానానికి సంగక్కర

By Nageswara Rao

హోబర్డ్: ఆస్టేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ వరల్డ్ కప్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర 400 పరుగులను పూర్తి చేశాడు. అంతే కాదు ప్రపంచంలో ఎవరూ సాధించని రికార్డు తన పేరిట లిఖించాడు.

అంతర్జాతీయ వన్డే క్రికెట్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించాడు. నాలుగు సెంచరీలతో వరల్డ్ కప్‌లో శ్రీలంక తరుపున అత్యధిక పరుగులు సాధించిన రికార్డుని కూడా సొంతం చేసుకున్నాడు.

వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఐదవ స్ధానంలో ఉన్న కుమార సంగక్కర ఈరోజు హోబర్డ్‌లో స్కాట్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించడంతో శ్రీలంక తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మొట్టమొదటి స్ధానంలో నిలిచాడు.

WC 2015: Sangakkara jumps from 5th to 1st position in Lanka's highest scorers' list

అంతక ముందు వరకు వరల్డ్ కప్‌లో శ్రీలంక తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా సనత్ జయసూర్య, తిలకరత్నే దిల్షాన్, మహిళా జయవర్దనే, అరవింద డిసిల్వా ఉన్నారు. శ్రీలంక తరుపున వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు.

కుమార సంగక్కర - 36 మ్యాచ్‌లు - 1476 పరుగులు (5 వరల్డ్ కప్ సెంచరీలు)

సనత్ జయసూర్య - 38 మ్యాచ్‌లు - 1165 పరుగులు (3 వరల్డ్ కప్ సెంచరీలు)

తిలకరత్నే దిల్షాన్ - 26 మ్యాచ్‌లు - 1112 పరుగులు (4 వరల్డ్ కప్ సెంచరీలు)

మహిలా జయవర్దనే - 39 మ్యాచ్‌లు - 1096 పరుగులు (4 వరల్డ్ కప్ సెంచరీలు)

అరవింద డిసిల్వా - 35 మ్యాచ్‌లు - 1064 పరుగులు (2 వరల్డ్ కప్ సెంచరీలు)

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X