న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాక్‌పై భారత్ డబుల్ హ్యాట్రిక్ గెలుపు: టీమిండియా, ఫ్యాన్స్ సంబరాలు

By Srinivas

అడిలైడ్: ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం భారత్ - పాక్ మధ్య ఉత్కంఠరేపే మ్యాచ్ ముగిసింది.. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రపంచకప్‌లలో భారత్, పాక్‌లు ఇప్పటి వరకు ఐదుసార్లు తలపడ్డాయి. పాక్ ఎప్పుడు గెలవలేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ మరింత ఉత్కంఠను రేపింది. అయితే, పాకిస్తాన్ ఆరోసారి కూడా భారత్ చేతిలో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. లక్ష్యచేధనలో పాక్ 47 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది.

భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ స్కోర్ కార్డు

పాకిస్తాన్ బ్యాటింగ్: షెహజాద్ 47, యూనిస్ ఖాన్ 6, సోహైల్ 38, మిస్బా ఉల్ హక్ 76, మక్సూబ్ 0, ఉమర్ అక్మల్ 0, అఫ్రీది 22, రియాజ్ 4, యాసిర్ షా 13, సోహైల్ ఖాన్ 7, మొహమ్మద్ ఇర్ఫాన్ 1 పరుగులు చేశారు.

భారత్ బౌలింగ్: షమీ తొమ్మిది ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు. ఉమేష్ యాదవ్ 10 ఓవర్లు వేసి 50 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. శర్మ 9 ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అశ్విన్ 8 ఓవర్లు వేసి 41 పరుగులు వేసి 1 వికెట్ తీశాడు. జడేజా 10 ఓవర్లు వేసి 56 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. రైనా 1 ఓవర్ వేసి ఆరు పరుగులు ఇచ్చాడు.

WC Indo-Pak clash: India pick Mohit and choose to bat

భారత్ 300 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. పాకిస్తాన్ 224 పరుగులకే 47 ఓవర్లలో ఆలౌటైంది.

భారత్ 76 పరుగుల తేడాతో పాక్ పైన గెలిచింది. పాక్ 224 పరుగులకు ఆలౌటైంది.

అడిలైడ్‌లో పాక్ పైన భారత్ ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్‌లో పాక్ పైన భారత్ డబుల్ హ్యాట్రిక్ సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.

224 పరుగుల వద్ద శర్మ వేసిన బౌలింగులో సోహైల్ ఖాన్ (10 బంతుల్లో 7 పరుగులు) అవుటయ్యాడు.

WC Indo-Pak clash: India pick Mohit and choose to bat

షమీ బౌలింగ్... 46 ఓవర్లో పాకిస్తాన్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మిస్బా ఉల్ హక్ (84 బంతుల్లో 76 పరుగులు) షమీ బౌలింగులో రహానేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.య

42వ ఓవర్లో 203 పరుగుల వద్ద పాకిస్తాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మోహిత్ శర్మ వేసిన బౌలింగులో యాసిర్ షా (23 బంతుల్లో 13 పరుగులు) ఉమేష్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

షమీ 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

సమీ బౌలింగులో అఫ్రిది అవుటయ్యాడు. అఫ్రిదీ అవుటైన వెంటనే రిజాజ్ కూడా అవుటయ్యాడు. అఫ్రిదీ 149 పరుగుల వద్ద ఆరో వికెట్‌గా, రిజాజ్ 154 పరుగుల వద్ద ఏడో వికెట్‌గా అవుటయ్యాడు. షమీ బౌలింగులో కోహ్లీ క్యాచ్ పట్టడం ద్వారా కోహ్లీ, షమీ బౌలింగులో ధోనీ క్యాచ్ పట్టడం ద్వారా రియాజ్ అవుటయ్యాడు.

భారత్ వరుసగా వికెట్లు తీస్తుండటంతో స్టేడియంలో అభిమానులు నినాదాలు చేస్తున్నారు.

WC Indo-Pak clash: India pick Mohit and choose to bat

వంద పరుగులకే ఐదు వికెట్లో కోల్పోయిన పాకిస్తాన్ ఇబ్బందుల్లో పడింది. భారత్ గెలుపు దిశలో పయనిస్తోందని చెప్పవచ్చు. అయితే, పాక్‌లో ఒక్క అఫ్రీది ఉన్నాడు. అతడు ప్రమాదకరి ఆటగాడు.

పాకిస్తాన్ 103 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఉమర్ అక్మల్ డకౌట్ అయ్యాడు. జడెజా బౌలింగులో మహేంద్ర సింగ్ ధోనీ క్యాచ్ పట్టగా.. అక్మల్ అవుటయ్యాడు.

24 ఓవర్లు ముగిసేసరికి పాక్ 102/4 స్కోర్‌తో ఉంది.

పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 102 పరుగుల వద్ద షెహజాద్ (47) అవుటయ్యాడు. ఆ వెంటనే అదే 102 పరుగుల వద్ద మక్సూద్ నాలుగో వికెట్‌గా అవుటయ్యాడు. ఉమేష్ యాదవ్ బౌలింగులోనే ఈ రెండు వికెట్లు పడ్డాయి. అతను వెంటవెంటనే ఈ వికెట్లు తీశాడు. మక్సూద్ డకౌట్ అయ్యాడు. ఉమేష్ యాదవ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు.

WC Indo-Pak clash: India pick Mohit and choose to bat

నిలకడగా ఆడుతున్న పాకిస్తాన్ 79 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హారిస్ సోహైల్ (36) అశ్విన్ బౌలింగులో షాట్ కొట్టి రైనాకు క్యాచ్ ఇచ్చాడు. సోహైల్ 48 బంతుల్లో నాలుగు ఫోర్లతో 36 పరుగులు చేశాడు.

పాక్ 5 ఓవర్లలో 28 పరుగులు చేసింది.

పాకిస్తాన్ 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. యూనిస్ ఖాన్(10 బంతుల్లో 6 పరుగులు) షమీ బౌలింగులో ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

WC Indo-Pak clash: India pick Mohit and choose to bat

భారత్ ఇన్నింగ్స్...

భారత్ స్కోర్ బోర్డ్: రోహిత్ శర్మ 20 బంతుల్లో 15 రన్స్, ధావన్ 76 బంతుల్లో 73 పరుగులు, కోహ్లీ 126 బంతుల్లో 107 పరుగులు, రైనా 56 బంతుల్లో 74 పరుగులు, ధోనీ 13 బంతుల్లో 18 పరుగులు, జడెజా 7బంతుల్లో 3 పరుగులు, రహానే 3 బంతుల్లో 0(డకౌట్) అవుటయ్యారు. అశ్విన్ 4 బంతుల్లో 1 పరుగు, షమీ 2 బంతుల్లో 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

పాకిస్తాన్ బౌలింగ్: మహమ్మద్ ఇర్ఫాన్ పది ఓవర్లు వేసి 58 పరుగులు, షాహిద్ అఫ్రీది 8 ఓవర్లు వేసి 50 పరుగులు, యాసిర్ షా 8 ఓవర్లు వేసి 60 పరుగులు, హారిస్ సోహైల్ 4 ఓవర్లు వేసి 26 పరుగులు ఇచ్చారు. సోహైల్ ఖాన్ 10 ఓవర్లు వేసి 55 పరుగులు ఇచ్చి 5 వికెట్లు, వాహబ్ రియాజ్ 10 ఓవర్లు వేసి 49 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు.

పాకిస్తాన్ జట్టులో సోహైల్ ఖాన్ అయిదు, వాహబ్ రియాజ్ 1 వికెట్ తీశాడు.

WC Indo-Pak clash: India pick Mohit and choose to bat

బారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. పాకిస్తాన్ ముందు 301 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కాగా, భారత్ 320 నుండి 330 పరుగులు చేస్తుందని భావించినప్పటికీ.. చివరి అయిదు ఓవర్లలో భారత్ ఏమాత్రం రాణించలేదు.

అశ్విన్ (1), షమీ(3)లు మ్యాచ్‌ను ముగించారు!

అనంతరం అదే 296 పరుగుల వద్దే భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. వరుస బంతుల్లో ధోనీ, రహానేలు అవుటయ్యారు.

తర్వాత ధోనీ కూడా 296 పరుగుల వద్దనే అవుటయ్యాడు. ధోనీ (18) సోహైల్ ఖాన్ బౌలింగులో మిస్బా ఉల్ హక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ధోనీ 13 బంతుల్లో 18 పరుగులు చేశాడు.

భారత్ 296 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. జడెజా (3) వాహబ్ రిజాయ్ బౌలింగులో బౌల్డ్ అయ్యాడు. ఆ

284 పరుగుల వద్ద రైనా వికెట్ పడింది.

భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. రైనా (74) సోహైల్ ఖాన్ బౌలింగులో హారీస్ సోహైల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రైనా 56 బంతుల్లో 74 పరుగులు చేశాడు.

WC Indo-Pak clash: India pick Mohit and choose to bat

273 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కోహ్లీ 107 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సోహైల్ ఖాన్ బౌలింగులో ఉమర్ అక్మల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

రెండో వికెట్‌కు ధావన్ - కోహ్లీలు, మూడో వికెట్‌కు కోహ్లీ - రైనాలు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు.

విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 119 బంతుల్లో అతను సెంచరీ చేశాడు. ఇది కోహ్లీకి కెరీర్‌లో 22వది, ప్రపంచ కప్‌లో రెండో సెంచరీ. ఏడు ఫోర్లు కొట్టాడు.

రైనా 27 బంతుల్లో 27 పరుగులు చేశాడు. కోహ్లీ 104 బంతుల్లో 86 పరుగులతో ఉన్నాడు. కోహ్లీ సెంచరీకి చేరువలో ఉన్నాడు.

ధావన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సురేష్ రైనా దూకుడుగా ఆడుతున్నాడు. రైనా - కోహ్లీల దూకుడుతో భారత్ 37 ఓవర్లలో 200 పరుగులు దాటింది.

WC Indo-Pak clash: India pick Mohit and choose to bat

శిఖర్ ధావన్ (73) పరుగుల వద్ద అవుటయ్యాడు. ధావన్ వికెట్ జట్టు స్కోరు 163 వద్ద ఉన్నప్పుడు పోయింది.

విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ చేశాడు. కోహ్లీ 63 బంతుల్లో 51 పరుగులతో ఉన్నాడు. ధావన్ 59 బంతుల్లో 56 పరుగులతో ఉన్నాడు.

శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ చేశాడు. 54 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ ఉంది.

విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 43 పరుగులతో ఉన్నాడు. కోహ్లీ నాలుగు ఫోర్లు కొట్టాడు.

20 ఓవర్లకు భారత్ స్కోర్ 98/1.

విరాట్ కోహ్లీకి లైఫ్ వచ్చింది. నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షాహిద్ అఫ్రీది బౌలింగులో కోహ్లీ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను యాసిర్ షా వదిలేశాడు. క్యాచ్ పట్టేందుకు అతడు చేసిన యత్నం ఫలించలేదు. బంతిని ఆందుకునేందుకు ముందుకు పరుగెత్తినా బాల్ అతడి చేతికి చిక్కలేదు. దీంతో భారత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

శిఖర్ ధావన్, కోహ్లీలు కాస్త దూకుడుగానే ఆడుతున్నారు. పదిహేను ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 71/1.

WC Indo-Pak clash: India pick Mohit and choose to bat

రోహిత్ శర్మ అవుటైన అనంతరం విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ధావన్‌తో కలిసి నిలకడగా ఆడుతున్నారు.

34 పరుగుల వద్ద తొలి వికెట్ పడిపోయింది. సోహైల్ ఖాన్ బౌలింగులో రోహిత్ శర్మ (15) మిస్బా ఉల్ హక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి ధావన్ 21 బంతుల్లో 9, రోహిత్ 17 బంతుల్లో 13 పరుగులు చేశారు

బ్యాటింగ్‌కు దిగిన శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు నిలకడగా ఆడుతున్నారు.

భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ దావన్, విరాట్ కోహ్లీ, రహానే, సురేష్ రైనా, ఎమ్మెస్ ధోనీ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, మహ్మద్ షమీ

పాకిస్తాన్ జట్టు: అహ్మద్ షెహజాద్, యూనిస్ ఖాన్, హారిస్ సోహల్, మిస్బావుల్ హక్ (సారథి) సోయబ్ మక్సూద్, ఉమర్ అక్మల్ (వికెట్ కీపర్), అఫ్రీది, వాహబ్ రియాజ్, యాసిర్ షా, సోహిల్ ఖాన్, మహ్మద్ ఇర్ఫాన్

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X