న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆనంద్ మళ్లీ ఓటమి: చెస్ ఛాంపియన్‌ కార్ల్‌సన్(పిక్చర్స్)

సోచీ(రష్యా): ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెల్చుకొని ఒకప్పుడు చెస్ ప్రపంచాన్ని శాసించిన భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఓటమి పాలయ్యాడు. కాగా, 23 ఏళ్ల మాగ్నస్ కార్ల్‌సెన్ అద్వితీయ ప్రతిభ అతనిని మరోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలబెట్టింది. అత్యంత కీలకమైన 11వ గేమ్‌లో ఛాలెంజర్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఓటమిపాలు కావడంతో కార్ల్‌సెన్‌కు ఈ కిరీటం మరోసారి దక్కింది.

నిరుడు చెన్నైలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆనంద్‌ను ఓడించి మొదటిసారి విశ్వవిజేతగా నిలిచిన కార్ల్‌సెన్ ఈసారి కూడా ఆధిపత్యాన్ని కొనసాగించాడు. 6.5-4.5 ఆధిక్యాన్ని సంపాదించడంతో చివరి గేమ్ అవసరం లేకుండాపోయింది. ప్రపంచ చెస్‌లో రారాజుగా వెలుగుతున్న ఆనంద్‌కు 23 ఏళ్ల కార్ల్‌సెన్ వరుసగా రెండోసారి షాకిచ్చి తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు. 12 గేమ్‌ల ఈ చాంపియన్‌షిప్ డ్రాతో ఆరంభమైంది.

మొదటి గేమ్‌లో పాయింట్లను పంచుకున్న ఆనంద్ రెండో గేమ్‌లో అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. అయితే, మూడో గేమ్‌లో ఎదురుదాడికి దిగి విజయం సాధించడంతో స్కోరు సమమైంది. 4, 5 గేమ్స్‌లు డ్రా అయ్యాయి. ఆరో గేమ్‌లో గెలిచిన కార్ల్‌సెన్ రెండోసారి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఏడో గేమ్‌లో ఇద్దరు ఆటగాళ్లు 122 ఎత్తుల వరకు పోరాటాన్ని కొనసాగించారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ చరిత్రలోనే ఇది అతి సుదీర్ఘమైన పోరుగా రికార్డుకెక్కిన ఈ గేమ్ చివరికి డ్రా అయింది. 8, 9, 10 గేమ్‌ల్లోనూ ఫలితం వెల్లడి కాకపోవడంతో, ఆనంద్‌కు 11వ గేమ్ అత్యంత కీలకంగా మారింది.

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్

ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెల్చుకొని ఒకప్పుడు చెస్ ప్రపంచాన్ని శాసించిన భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఓటమి పాలయ్యాడు.

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్

కాగా, 23 ఏళ్ల మాగ్నస్ కార్ల్‌సెన్ అద్వితీయ ప్రతిభ అతనిని మరోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలబెట్టింది. అత్యంత కీలకమైన 11వ గేమ్‌లో ఛాలెంజర్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఓటమిపాలు కావడంతో కార్ల్‌సెన్‌కు ఈ కిరీటం మరోసారి దక్కింది.

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్

నిరుడు చెన్నైలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆనంద్‌ను ఓడించి మొదటిసారి విశ్వవిజేతగా నిలిచిన కార్ల్‌సెన్ ఈసారి కూడా ఆధిపత్యాన్ని కొనసాగించాడు. 6.5-4.5 ఆధిక్యాన్ని సంపాదించడంతో చివరి గేమ్ అవసరం లేకుండాపోయింది.

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్

ప్రపంచ చెస్‌లో రారాజుగా వెలుగుతున్న ఆనంద్‌కు 23 ఏళ్ల కార్ల్‌సెన్ వరుసగా రెండోసారి షాకిచ్చి తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు.

గెలిస్తే తప్ప పోటీలో నిలబడలేని పరిస్థితుల్లో తీవ్రమైన ఒత్తిడికి గురైనట్టు అతని ఆటతీరు స్పష్టం చేసింది. 45 ఎత్తుల తర్వాత కార్ల్‌సెన్ విజయ కేతనం ఎగురవేశాడు. తెల్లపావులతో ఆడే అవకాశం లభించడంతో కార్ల్‌సెన్‌కు లాభించింది. అతని దాడిని అడ్డుకోవడంలో విఫలమైన ఆనంద్ 11 గేమ్‌తోనే నిష్క్రమించాడు.
ఐదేళ్ల ప్రాయంలోనే చెస్‌ను అభ్యాసం చేయడం మొదలు పెట్టిన కార్ల్‌సెన్ తల్లిదండ్రులు సిగ్రన్ ఒయెన్, హెన్రిక్ అల్బర్ట్ కార్ల్‌సెన్. తమ కుమారుడి ఆసక్తిని గమనించి చిన్నతనం నుంచే చెస్‌లో తర్ఫీదునిచ్చారు.

2004లో గ్రాండ్ మాస్టర్ హోదాను సంపాదించే సమయానికి కార్ల్‌సెన్ వయసు 17 సంవత్సరాల 148 రోజులు. అప్పట్లో ఈ హోదాను సాధించిన అత్యంత పిన్న వయస్కుల్లో రెండో వాడిగా కార్ల్‌సెన్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. ఆతర్వాతి కాలంలో అతను మూడో స్థానానికి పడిపోయాడు. కాగా, 2010లో ప్రపంచ నంబర్ వన్‌గా ఎదిగాడు. 19 సంవత్సరాల, 21 రోజుల వయసులోనే నంబర్ వన్ స్థానానికి చేరుకుని, అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.

2013లో 2,861 ఎలో రేటింగ్ పాయింట్లను చేరాడు. చెస్ చరిత్రలోనే ఇది అత్యధిక రేటింగ్. అదే ఏడాది చెన్నైలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆనంద్‌ను ఓడించి మొదటిసారి విశ్వ విజేత అయ్యాడు. ఇప్పుడు ఆ టైటిల్‌ను మళ్లీ నిలబెట్టుకున్నాడు. సంప్రదాయాలకు భిన్నంగా, రకరకాల ఓపెనింగ్స్‌తో ప్రత్యర్థులపై విరుచుకుపడే కార్ల్‌సెన్ చెస్‌లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు.

కాగా, ప్రపంచ ఛాంపియన్ షిప్ మొత్తం ప్రైజ్‌మనీ 7.64 కోట్లు. విజేత కార్ల్‌సన్‌కు 4.52 కోట్లు,
పరాజిత ఆనంద్‌కు 3.15 కోట్లు లభించనున్నాయి.

మళ్లీ 2016లోనే ఛాంపియన్‌షిప్:

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ మళ్లీ 2016లో జరగనుంది. ఈ టోర్నీలో కార్ల్‌సన్‌కు ప్రత్యర్థిగా ఆనంద్ మరోసారి బరిలోకి దిగాలంటే క్యాండిడేట్ చెస్ టోర్నీని గెలవాలి. ఈ టోర్నీ బరిలో నిలవాలని తహతహలాడుతున్న ఇతర గ్రాండ్‌మాస్టర్లందరినీ మరోసారి ఓడించి ముందుకు సాగాలి.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X