న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

టైటిల్ గెలుచుకునే సత్తా ఉందన్న మాట్టరాజీ

By Pratap

చెన్నై: వరుసగా రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ గెలుచుకోవడం ఖాయమని చెన్నయిన్ ఎఫ్ సి కోచ్ మార్కో మాట్టరాజీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటలీ ప్రీ సీజన్ ముగించుకుని వచ్చిన తర్వాత తవ జట్టు చక్కగా రూపుదిద్దుకున్నదని తెలిపారు. తాము టైటిల్ ను నిలబెట్టుకునేందుకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. జట్టు ఆటపై ఎటువంటి అనుమానాలు, ఆందేళనే లేవన్నారు. గేమ్ లోని అన్ని విభాగాల్లో సంసిద్ధంగా ఉన్నామని అన్నారు. తన జట్టు ట్రైనింగ్ సమయంలో జట్టు సభ్యుల్లో మధ్య మంచి సమన్వయం ఉన్నదని వివరించారు. ప్రత్యేకించి అప్ ఫ్రంట్, మిడిల్, డిఫెన్స్, అటాకింగ్ విభాగాల్లో పోటీ తత్వం నెలకౌన్నదని మాట్టరాజీ వ్యాఖ్యానించారు. ఇలానో, మెండోజా లోటు ప్రభావమేమీ ఉండబోదని స్పష్టంచేశారు.

'అంతర్జాతీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మేం శక్తిమంతమైన, మంచి క్రీడాకారులను నియమించుకున్నాం. మంచి టీం రూపుదిద్దుకున్నది. ఈ ఎడిషన్ లో నూతన ఆటగాళ్లు చేరారు. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా ఆడాలని సంకల్పించాం. ఈసారి కూడా టైటిల్ మాదేనని ఆశాభావంతో ఉన్నాం' అని ఆయన అన్నారు.

చెన్నై సంచలనం జెజె లాల్పెఖులౌవా గత రెండేళ్లుగా ఎంతో పురోగతి సాధించాడని, ఆయనను పూర్తిస్థాయి ఆటగాడిగా తాను అంగీకరిస్తున్నానని మాట్టరాజీ వ్యాఖ్యానించారు. జట్టులో భారత క్రీడాకారుల్లో జెజె చాలా కీలకమైనవాడని పేర్కొన్నారు. గత 3,4 నెలలుగా జరుగుతున్న శిక్షణలోనూ సరైన మార్గంలోనే ప్రగతి సాధించాడని వివరించారు. జెజె ఆటతీరెలాగే కొనసాగిస్తూ పురోగతి సాధిస్తాడని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆటగాళ్ల వ్యవహార శైలితో నిమిత్తం లేకుండా మొత్తం 17 మ్యాచ్ లు ఆడి టైటిల్ గెలుచుకోవడమే తన లక్ష్యమన్నారు. తొలి రెండు ఎడిషన్లలో ప్రజల నుంచి తమకు లభించిన మద్ధతు అద్భుతమని తెలిపాడు.

We are raring to go and win ISL: Materazzi

నార్త్ఈస్ట్ లో మిడ్ ఫీల్డ్ క్లిష్టం

ఫుట్ బాల్ ఆటలో దూసుకెళ్లాలని ఆసక్తి కనబరుస్తున్న నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు గత రెండు ఐఎస్ఎల్ ఎడిషన్లలో సాధించిన ఫలితాలేమీ లేవు. కానీ ఈ దఫా మాత్రం విభిన్నమైన రీతిలో ఆడాలని సంకల్పించారు ఫ్రాంచైసీ నిర్వాహకులు. శనివారం కేరళ బ్లాక్ బస్టర్స్ పై ప్రారంభ మ్యాచ్ లో తల పడనున్న నార్త్ఈస్ట్ ఈ దఫా కనీసం ఫ్లే ఆఫ్ దశకైనా వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నది. రివర్టింగ్ బ్రాండ్ తో స్కిల్ పాసింగ్, ఫాస్ట్ కౌంటర్ అటాక్స్ విధానం గల సామర్థ్యం ఉన్న ఆటగాళ్లపై అభిమానులు, ప్రజలు, ప్రభుత్వం మధ్య అంచనాలు భారీగానే ఉన్నాయి. అనుభవం కలిగిన క్రీడాకారుడైన కోచ్ నెలో వింగాడా పర్యవేక్షణలో ఆడుతున్న వారంతా సగటున 26 ఏళ్ల వయస్కులే కావడం గమనార్హం.

'ఫ్రాంచైసీ యజమాని జాన్ అబ్రహం, నేను ప్రతి గేమ్ ఆటలో జట్టు ఆడిన తీరు గమనించాం. మేం మరింత ప్రతిభావంతులైన ఆటగాళ్లను చాలా మందిని తేవాల్సి ఉన్నది. నైపుణ్యంతోపాటు కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి గల వారితో మంచి ఆటగాళ్లతో కూడిన జట్టును నియమించుకోవచ్చు' అని విగాండా వ్యాఖ్యానించారు. గత జట్టు సారధి సెసార్ ఫారియాస్ తోపాటు ఐదుగురు క్రీడాకారులు పాత వారేనని, మిగతా వారిని తాజాగా విదేశాల నుంచి నియమించినట్లు తెలిపాడు.

నార్త్ జోన్ సారధి దిదియార్ జొకొరా మిడ్ ఫీల్డ్ పైనే కేంద్రీకరిస్తారని వింగాడా అన్నారు. ప్రస్తుతం మిడ్ ఫీల్డ్ ను బలోపేతం చేయాలని సంకల్పించామన్నాడు. యుస కస్తుమితోపాటు మోహన్ బగన్ కూడా మంచి మిడ్ ఫీల్డర్లే కావడం గమనార్హం. మోహన్ బగన్ తోపాటు సత్యసేన్ సింగ్ భాగస్వామ్యంతో దిదియార్ జట్టుకు చాలా కీలకమని తెలిపారు. రాయల్ నేషనల్ వాహింగ్డో జట్టు తరఫున ఆడిన సంతోష్ కశ్యప్.. ఈ దఫా నార్త్ఈస్ట్ జట్టులో చేరడం శుభ పరిణామం అని నెలో వింగాడా వ్యాఖ్యానించారు.

ఫార్వర్డ్ లైన్ లో వెనుకబడిన జట్టును ముందుకు తీసుకెళ్లే బాధ్యత, మరిన్ని గోల్స్ చేసే బాధ్యత నికోలస్ వెలెజ్ పైనే ఈ బాధ్యతలు ఉన్నాయి. శాఫ్ఫ్ చాంపియన్ షిప్ ను డ్రా ముగించడంలో కీలక పాత్ర పోషించిన లల్లియాంజులా ఛాంగ్టే ఈ దఫా జట్టుకు పెద్ద అండ కానున్నాడు. వీరందరికీ తోడు ప్రముఖ భారత్ గోల్ కీపర్ సుబ్రతా పాల్, టిపి రెహెనేష్ లు నార్త్ఈస్ట్ జట్టు లో చేరడం ప్రత్యర్థులకు మిగిలింది. తొలి సీజన్ తో పోలిస్తే 2015లో మెరుగైన ఫలితాలు సాధించిన నార్త్ ఈస్ట్ జట్టు కేవలం 2 పాయింట్లతో నాకౌట్ దశకు దూరమైంది. ఐదో స్థానంలో నిలిచింది. మిడ్ ఫీల్డ్ నుంచి గోల్ పోస్ట్ వరకు క్రీడాకారులు తమ పనితీరుకు మెరుగులు పెట్టాలని వింగాడ హితవు చెప్పారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X