న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్సీ: ధోనిపై రోహిత్ శర్మ 3 విజయాలు, కోహ్లీని ఒత్తిడికి గురి చేస్తుందా..?

By Nageswara Rao

టీమిండియాకు నాయకత్వం వహించేందుకు సరైన కెప్టెన్‌ని ఎంపిక చేసేందుకు ముందు నుంచే ఒక సాంప్రదాయ పద్ధతిని పాటిస్తున్నారు. ఎంపిక చేసిన కెప్టెన్లలలో కొంత మంది అధ్భుత విజయాలను సాధిస్తే, మరికొంత మంది ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

భారతదేశానికి క్రికెటర్‌గా ఎన్నో అద్భుత విజయాలను అందించిన క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా విఫలమైన సంగతి తెలిసిందే. మరో ఆటగాడు రాహుల్ ద్రవిడ్, బ్యాట్స్‌మెన్‌గా దివాల్ అనిపించుకున్న ద్రవిడ్, కెప్టెన్‌గా రాణించలేకపోయాడు.

ఆ తర్వాతి తరంలో ఇండియా ఫేస్‌గా మహేంద్ర సింగ్ ధోనిని సెలక్టర్లు గుర్తించారు. ఇటీవలే అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు ధోని గుడ్ బై చెప్పడంతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీని ఇండియా ఫేస్‌గా సెలక్టర్లు గుర్తించారు.

ఈ సమయంలో విరాట్ కోహ్లీ భారత్‌కు విజయాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కంటే మెరుగ్గా పరుగులు సాధించాడు. దీంతో భారత సాంప్రదాయం ప్రకారం ఇండియాకు భావి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని ఎంపిక చేశారు.

Will Rohit Sharma's 3 wins over MS Dhoni in IPL 8 will put Virat Kohli under pressure?

భారత్‌కు టెస్టుల్లో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహారిస్తుండగా, వన్డేల్లో మాత్రం ధోనినే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకి కెప్టెన్‌గా ఉన్నారు.

అయితే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఏమంత విజయాలను నమోదు చేయలేదు. గత ఏడాది జరిగిన ఆసియా కప్‌లో భారత్‌ను ఫైనల్స్‌కు చేర్చడంలో కోహ్లీ విఫలమయ్యాడు. అంతేకాదు, ఐపీఎల్‌లో కూడా తన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుని పైనల్స్‌కు తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలమయ్యాడు.

దీనికంతటికి కారణం కోహ్లీ వైఖరి. మైదానంలో అంఫైర్లు, ఆటగాళ్లతో తరుచూ గొడవడుతూ ఉంటాడు. కోహ్లీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోతే సెలక్టర్లు మరో కొత్త ఫేస్‌ను వెతికే పనిలో ఉన్నారని తెలుస్తోంది. వారి మదిలో మెదిలే ప్రశ్న. కోహ్లీ స్ధానంలో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎందుకు నియమించకూడదు..?

అయితే ఈ వార్త కోహ్లీ అభిమానులను కాస్తంత కలవరపెడుతోంది? ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో రోహత్ శర్మ తన చక్కని ఆటతీరుతో అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాట్స్‌మెన్‌గా అభిమానులను ఆకట్టుకున్నాడు.

ఇద్దరు కూడా వాళ్ల వాళ్ల జట్లకు కెప్టెన్లుగా వ్వవహరించారు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు చెన్నైతో తలపడిన మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. అదే ముంబై మాత్రం చెన్నైతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

ముఖ్యంగా ఐపీఎల్‌లో ఫైనల్లో కెప్టెన్ రోహిత్ శర్మ 26 బంతుల్లో సాధించిన 50 పరుగులు విజయంలో ఎంతో కీలకం. ధోని నేతృత్వంలోని చెన్నై జట్టుని మట్టి కరిపిచడంలో రోహిత్ శర్మ విజయం సాధించి ఐపీఎల్ ఛాంపియన్‌గా ముంబై జట్టు రెండోసారి అవతరించడంలో కెప్టెన్‌గా కీలకపాత్ర పోషించాడు.

ఇలా చేయడం రోహిత్ శర్మకు తొలిసారి కాదు. 2013లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నైపై ముంబైని గెలిపించాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ముంబై జట్టు పరాజయం పాలైంది. ఏమాత్రం నిరాశ చెందకుండా ఆ తర్వాత ఆడిన మ్యాచ్‌ల్లో జట్టుని ముందుండి నడిపించాడు.

2013లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ తన తొలి టెస్టు మ్యాచ్‌లోనే వెస్టిండిస్‌పై సెంచరీ (177) సాధించాడు. అంతేకాదు ప్రపంచ క్రికెట్ రెండు డబుల్ సెంచరీలు (264, 209) చేసిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మనే. ఐపీఎల్ టైటిన్‌ని రెండు సార్లు గెలిచిన మూడు కెప్టెన్లలో రోహిత్ ఒకడు.

దీనిని బట్టి చూస్తే రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడు మాత్రమే కాదు, కెప్టెన్‌గా కూడా నిరూపించుకున్నాడు. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ లెజెండ్లు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అనంతరం పేర్కొన్న విషయం తెలిసిందే.

బీసీసీఐ సెలక్టర్లు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీనే నమ్ముకోకుండా, రోహిత్ శర్మకు కూడా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని క్రికెట్ విశ్లేషకులు మనసులోని మాట. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ప్రస్తుతు టీమిండియాకు బ్యాటింగ్ పిల్లర్స్‌గా ఉన్నారు. కెప్టెన్సీలో మాత్రం విరాట్ కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మనే కాస్తం మెరుగ్గా ఉన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X