న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇద్దరు తెలుగు వారికి అర్జున అవార్డు: 2017 స్పోర్ట్స్ అవార్డుల జాబితా

2017 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడల అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో భాగంగా ఇద్దరికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వగా, ఏడుగురికి ద్రోణాచార్య అవార్డు లభించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: 2017 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడల అవార్డులను ప్రకటించింది. క్రీడ‌ల్లో విశిష్టంగా రాణించిన వారికి ఈ పుర‌స్కారాల‌ను అంద‌జేస్తారు. ఈ అవార్డుల్లో భాగంగా ఇద్దరికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వగా, ఏడుగురికి ద్రోణాచార్య అవార్డులు దక్కాయి.

హాకీ క్రీడాకారుడు సర్దార్ సింగ్‌, పారా అథ్లెట్ దేవేంద్రలు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు దక్కిన వారిలో ఉన్నారు. 2003-04లో భారత జూనియర్‌ టీమ్‌లో స్థానం సంపాదించిన సర్దార్‌.. అనతి కాలంలోనే సీనియర్‌ జట్టుకు ఎంపికయ్యాడు. పిన్న వయసులోనే హాకీ ఇండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

Winners of Khel Ratna, Arjuna, Dronacharya, Dhyan Chand awards announced

ఇక 17 మందికి అర్జున అవార్డు దక్కింది. అర్జున అవార్డు దక్కిన వారిలో తెలుగు క్రీడాకారులు వి.జ్యోతి సురేఖ (విలు విద్య‌), సాకేత్ మైనేని (టెన్నిస్‌)లతో పాటు క్రికెటర్లు ఛటేశ్వర్ పుజారా, హర్మన్ ప్రీత్ కౌర్‌లు కూడా అర్జున అవార్డు దక్కిన వారిలో ఉన్నారు. ముగ్గురికి ధ్యాన్ చంద్ అవార్డులు అందిస్తున్న‌ట్లు కేంద్రం ప్రకటించింది.

ధ్యాన్‌చంద్ అవార్డుకు ఎంపికైన వారిలో భూపేంద్ర సింగ్‌(అథ్లెటిక్స్‌), స‌య్యిద్ షాహిద్ హ‌కిమ్‌(ఫుట్‌బాల్‌), సుమ‌రాయ్ టీటీ(హాకీ)లు ఉన్నారు. ఇక, ద్రోణాచార్య అవార్డుకి ఎంపికైన వారిలో డాక్ట‌ర్ ఆర్‌. గాంధీ (అథ్లెటిక్స్‌), హీరా నంద్ క‌టారియా(క‌బ‌డ్డీ), జీఎస్ఎస్‌వీ ప్ర‌సాద్‌(బ్యాడ్మింట‌న్‌), బ్రిజ్ భూష‌ణ్ మోహంతి (బాక్సింగ్‌), పీఏ. రాఫెల్‌(హాకీ), సంజ‌య్ చ‌క్ర‌వ‌ర్తి(షూటింగ్‌), రోష‌న్ లాల్‌(రెజ్లింగ్‌)లు ఉన్నారు.

ఆగస్టు 29న రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో ఈ అవార్డుల‌ను అంద‌జేస్తారు. అవార్డు గ్ర‌హీత‌ల‌కు పతకం, ప్ర‌శంసా ప‌త్రంతో పాటు న‌గ‌దు బహుమతిని అంద‌జేస్తారు. రాజీవ్ ఖేల్ ర‌త్నాల‌కు రూ.7.5 ల‌క్ష‌లు, అర్జున‌, ద్రోణాచ‌ర్య‌, ధ్యాన్‌చంద్ అవార్డు గ్ర‌హీత‌ల‌కు స‌ర్టిఫికెట్‌తో పాటు రూ.5 ల‌క్ష‌ల న‌గ‌దు బహుమతిని ఇస్తారు.

స్పోర్ట్స్ అవార్డుల జాబితా:

రాజీవ్ ఖేల్ రత్న అవార్డు:
* Shri Devendra (పారా అథ్లెట్)
* Shri Sardar Singh (హాకీ)

ద్రోణాచార్య అవార్డు:
* Late Dr. R. Gandhi (అథ్లెటిక్స్)
* Mr. Heera Nand Kataria (కబడ్డీ)
* Mr. G.S.S.V. Prasad (బ్యాడ్మింటన్) లైఫ్ టైమ్
* Mr. Brij Bhushan Mohanty (బాక్సింగ్) లైఫ్ టైమ్
* Mr. P.A. Raphel (హాకీ) లైఫ్ టైమ్
* Mr. Sanjoy Chakraverthy (షూటింగ్) లైఫ్ టైమ్
* Mr. Roshan Lal (రెజ్లింగ్) లైఫ్ టైమ్

అర్జున అవార్డు:
* Ms. V.J. Surekha (ఆర్చరీ)
* Ms. Khushbir Kaur (అథ్లెటిక్స్)
* Mr. Arokia Rajiv (అథ్లెటిక్స్)
* Ms. Prasanthi Singh (బాస్కెట్ బాల్)
* Sub. LaishramDebendro Singh (బాక్సింగ్)
* Mr. CheteshwarPujara (క్రికెట్)
* Ms. Harmanpreet Kaur (క్రికెట్)
* Ms. OinamBembem Devi (పుట్‌బాల్)
* Mr. S.S.P. Chawrasia (గోల్ఫ్)
* Mr. S.V. Sunil (హాకీ)
* Mr. Jasvir Singh (కబడ్డీ)
* Mr. P. N. Prakash (షూటింగ్)
* Mr. A. Amalraj Table (టెన్నిస్)
* Mr. SakethMyneni (టెన్నిస్)
* Mr. SatyawartKadian (రెజ్లింగ్)
* Mr. Mariyappan (పారా అథ్లెట్)
* Mr. Varun Singh Bhati (పారా అథ్లెట్)

ద్రోణాచార్య అవార్డు:
* Mr. Bhupender Singh (అథ్లెటిక్స్)
* Mr. Syed Shahid Hakim (పుట్ బాల్)
* Ms. Sumarai Tete (హాకీ)

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X