న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సౌతాఫ్రికా రికార్డ్ విన్: డివిల్లీర్స్ రికార్డ్, విండీస్ కెప్టెన్ చెత్త బౌలింగ్, గేల్ విఫలం

By Srinivas

సిడ్నీ: ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య సిడ్నీలో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘోర పరాజయం పాలైంది. విండీస్ 151 పరుగులకే కుప్పకూలడంతో దక్షిణాఫ్రికా 257 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బంతితో ఆకట్టుకున్న గేల్.. ఆ తర్వాత బ్యాటింగులో విఫలమయ్యాడు. వెస్టిండీస్ కెప్టెన్ చెత్త రికార్డ్ మూటకట్టుకోగా, సౌతాఫ్రికా డివిల్లీర్స్ రికార్డులు సృష్టించాడు. 257 పరుగుల తేడాతో గెలిచిన సౌతాఫ్రికా ప్రపంచకప్‌లో అతిపెద్ద విజయం నమోదు చేసింది.

స్మిత్ 31, గేల్ 3, శామ్యూల్ 0, కార్టర్ 10, రామ్ దిన్ 22, సిమ్మన్స్ 0, సామీ 5, రసెల్ 30, రస్సెల్ 0, హోల్డర్ 56, బెన్ 1 పరుగులు చేసి అవుటయ్యారు. 409 పరుగుల చేధించే దిశలో ఏమాత్రం కనిపించలేదు. 110 పరుగులకే వెస్టిండీస్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. 151 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది.

World Cup 2015: Gayle Strikes See off Amla & du Plessis as West Indies Fight Back

డివిల్లీయర్స్ రికార్డ్ సృష్టించాడు. అతను ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. అతను 64 బంతుల్లో 150 పరుగులు చేశాడు. 16 బంతుల్లో 50 పరుగులు, 31 బంతుల్లో 100 పరుగులు, 64 బంతుల్లో 150 పరుగులు చేశాడు.

విండీస్ కెప్టెన్ హోల్డర్ తన పేరిట ఓ చెత్త రికార్డ్ మూటకట్టుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో 10 ఓవర్లలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డ్ నమోదు చేశాడు. మ్యాచ్ ఆరంభంలో మొదటి రెండు ఓవర్లలో ఒక్క పరుగు ఇవ్వకుండానే అదరగొట్టాడు. చివరలో డివిల్లియర్స్ పుణ్యమా అని ఏకంగా పది ఓవర్లలో 104 పరుగులు ఇచ్చాడు.

హోల్డర్ వేసిన 48వ ఓవర్లో డివిల్లీర్స్ 4, 6, 2, 4, 4, 4, 6 బాదాడు. హోల్డర్ రెండు నోబాల్స్ వేశాడు. ఈ ఓవర్లో ఏకంగా 34 పరుగులు వచ్చాయి. హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో డివిల్లీర్స్ వరుసగా 2, 6, 6, 4, 6, 6 బాదాడు. ఈ ఓవర్లో 30 పరుగులు వచ్చాయి. డివిల్లీర్స్ 66 బంతుల్లో 162 పరుగులు చేశాడు.

ప్రపంచ కప్‌లో భాగంగా సిడ్నీలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. 5 వికెట్లు కోల్పోయి 408 పరుగులు చేసింది. విధ్వంసకర బ్యాట్స్‌మన్ డివిలియర్స్ మరోసారి చెలరేగి ఆడాడు. 52 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి, 66 బంతుల్లో 162 పరుగులు చేశాడు. ఆమ్లా 65, డుప్లిసిస్ 62, రోసో 61 పరుగులతో రాణించారు. దీంతో విండీస్ విజయలక్ష్యం 409 అయింది.

అంతకుముందు మ్యాచులో వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ మరోసారి బంతితో సత్తా చాటాడు. వరుసగా రెండు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను దెబ్బతీశాడు. అర్ధ శతకంతో ప్రమాదకరంగా మారుతున్న డుప్లెసిస్ (62), ఆమ్లా (65)లను ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. గేల్ రెండు కీలక వికెట్లు పడగొట్టడం గమనార్హం.

గేల్ బంతితో రాణించడంతో డుప్లెసిస్ వికెట్ 142 పరుగుల వద్ద, ఆమ్లా వికెట్ 146 పరుగుల వద్ద పడింది. ఆ రెండు వికెట్లు వెంటవెంటనే పడ్డాయి. గేల్ బౌలింగులో అమ్లా ఎల్బీడబ్ల్యు పెవిలియన్ చేరాడు. గేల్ బౌలింగులో డుప్లెసిస్ కొట్టిన బంతిని రామ్ దిన్ క్యాచ్ పట్టడంతో మరో వికెట్ పడింది. వీరు ఇద్దరు కూడా 30వ ఓవర్లో అవుటయ్యాడు.

క్రిస్ గేల్ నాలుగు ఓవర్లు వేసి 21 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. కాగా, సౌతాఫ్రిగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. డికాక్ (19), ఆమ్లా (65), డుప్లెసిస్ (62) అవుటయ్యారు. రసౌ, డివిల్లియర్స్‌లు బ్యాటింగ్ చేస్తున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X