న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచకప్ చరిత్రలో సౌతాఫ్రికా రికార్డ్, భారత్ వెనుకే.. ఇవీ రికార్డ్‌లు

By Srinivas

కాన్‌బెర్రా: ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం నాడు కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో ఐర్లాండుతో జరుగుతున్న మ్యాచులో దక్షిణాఫ్రికా పలు రికార్డులు సృష్టించింది. సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది.

ఈ ప్రపంచకప్‌లో నాలుగువందల పరుగుల మైలురాయిని దక్షిణాఫ్రికా రెండోసారి దాటింది. ఫిబ్రవరి 27వ తేదీన సిడ్నీలో వెస్టిండీస్ పైన ఐదు వికెట్లు కోల్పోయి 408 పరుగులు చేసింది.

ప్రపంచకప్‌లో మ్యాచ్ తర్వాత మ్యాచ్‌లో.. 400 పై చిలుకు పరుగులు చేసిన తొలి జట్టు దక్షిణాఫ్రికా.

దక్షిణాఫ్రికాకు 400 పై చిలుకు పరుగులు చేయడం ఇది ఐదోసారి. తద్వారా భారత్‌తో సమానంగా ఉంది.

World Cup 2015: South Africa set world record in Canberra

గత 44 రోజుల్లో దక్షిణాఫ్రికా 400పై చిలుకు పరుగులు చేయండ మూడోసారి. జనవరిలో జోహన్నస్ బర్గ్‌లో వెస్టిండీస్ పైన 439 పరుగులు చేసింది. అప్పుడు రెండు వికెట్లే కోల్పోయింది. ఏబీ డివిల్లీర్స్ 31 బంతుల్లో సెంచరీ చేసి రికార్డ్ సృష్టించాడు.

40 సంవత్సరాల ప్రపంచకప్ చరిత్రలో.. ఏ జట్టు కూడా ఒకే ఎడిషన్‌లో రెండుసార్లు 400కు పైగా పరుగులు చేయలేదు. ఇప్పుడు దక్షిణాఫ్రికా వారం వ్యవధిలోనే రెండుసార్లు చేసి రికార్డ్ సృష్టించింది.

ఐర్లాండ్ పైన మంగళవారం దక్షిణాఫ్రికా 411/4 పరుగులు చేసింది. ఇది ప్రపంచకప్ చరిత్రలో రెండో బెస్ట్. అంతకుముందు భారత్ జట్టు బెర్ముడా పైన 413/5 చేసింది. ఇది తొలి బెస్ట్.

హషీమ్ ఆమ్లా, డుప్లెసిస్ ఇద్దరు సెంచరీలు చేశారు.

159 పరుగులు చేసిన ఆమ్లాకు ఇది కెరీర్ బెస్ట్. డుప్లెసిస్ 109 పరుగులు చేశాడు. రసౌ 61 పరుగులు, మిల్లర్ 46 పరుగులు చేశారు. దీంతో చివరి పది ఓవర్లలో దక్షిణాఫ్రికా 121 పరుగులు చేసింది. మొన్న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో సౌతాఫ్రికా చివరి పది ఓవర్లలో 150 పరుగులు చేసింది.

ప్రపంచ కప్‌ల్లో టాప్ 3 అత్యధిక స్కోర్.

413/5 in 50 ఓవర్లు - భారత్ Vs బెర్ముడా - 2007లో
411/4 in 50 ఓవర్లు - దక్షిణాఫ్రికా Vs ఐర్లాండ్ - 2015లో
408/5 in 50 ఓవర్లు - దక్షిణాఫ్రికా Vs వెస్టిండీస్ - 2015లో

వన్డే చరిత్రలో 400+ (14)

5సార్లు సౌతాఫ్రికా, భారత్, రెండుసార్లు శ్రీలంక, ఒకసారి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X