న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గేల్ విఫలమైన చోట డివిల్లీర్స్ రికార్డుల మోత... ఇవే, 2 ఓవర్లలో 64 రన్స్

By Srinivas

సిడ్నీ: ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా రికార్డ్ విజయం సాధించింది. ఈ మ్యాచులో వెస్టిండీస్ సారథి హోల్డర్ చెత్త రికార్డ్ నమోదు చేయగా, సౌతాఫ్రికా ప్లేయర్ ఏబీ డివిల్లీర్స్ పలు రికార్డులు నమోదు చేశాడు.

డివిల్లీర్స్ 66 బంతుల్లో 162 పరుగులు చేశాడు. అతని దూకుడుతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 408 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో వెస్టిండీస్ కేవలం 33.1 ఓవర్లకే 151 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో డివిల్లీర్స్ పలు రికార్డులు సృష్టించాడు.

వన్డేల్లో అత్యంత వేగవంతమైన 150 పరుగులు. డివిల్లీర్స్ 64 బంతుల్లో 150 పరుగులు చేశాడు. గతంలో ఇది షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా) పేరి ఉంది. 2011లో బంగ్లాదేశ్ పైన 83 బంతుల్లో 150 పరుగులు చేశాడు. అలాగే 16 బంతుల్లో 50 పరుగులు, 31 బంతుల్లో 100 పరుగుల రికార్డ్ కూడా సృష్టించాడు.

రెండో వేగవంతమైన ప్రపంచక కప్ సెంచరీ ఇది. 52 బంతుల్లో సెంచరీ చేశాడు. గతంలో కెవిన్ ఓ బ్రెయిన్ (ఐర్లాండ్) 50 బంతుల్లో సెంచరీ చేశాడు.

ఆస్ట్రేలియాలో అత్యంత ఎక్కు స్కోర్ చేసిన టీం. ఆస్ట్రేలియాలో 400 పరుగుల మైలు రాయి దాటలేదు. ఇప్పుడు సౌతాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి 408 పరుగులు చేసింది.

ప్రపంచకప్ చరిత్రలో రెండో హయ్యెస్ట్ స్కోర్. 2007లో బెర్ముడా పైన భారత్ 5 వికెట్లు కోల్పోయి 413 పరుగులు చేసింది.

 World Cup: Full list of records set by AB de Villiers and South Africa

డివిల్లీర్స్‌కు (162) తొమ్మిదో అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్.

కెప్టెన్‌గా ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఎనిమిదో వాడు డివిల్లీర్స్. 1987లో వెస్టిండీస్ సారథి వివి రిచర్డ్స్ శ్రీలంక పైన 181 పరుగులు చేశాడు.

ఒక్క ఓవర్లో డివిల్లీర్స్ 34 పరుగులు చేశాడు. వెస్టిండీస్ సారథి హోల్డర్ వేసిన 48వ ఓవర్లో వరుసగా.... 4, 6+1nb, 2, 4+1nb, 4, 4, 2, 6 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో... ఒక ఒవర్లో ఇది రెండో అత్యుత్తమం. 2007లో గిబ్స్ నెదర్లాండ్స్ పైన 36 పరుగులు చేశాడు.

డివిల్లీర్స్ స్ట్రైక్ రేట్ 245.45. సెంచరీ, అంతకంటే పైగా పరుగులు చేసిన వారిలో ఇది రికార్డ్.

మొత్తంగా చూస్తే ప్రపంచకప్ చరిత్రలో డివిల్లీర్స్ 245.45 స్ట్రైక్ రేట్ పదవది. 2011లో న్యూజిలాండ్‌కు చెందిన ఫ్రాంక్లిన్ 8 బంతుల్లో 31 పరుగులు చేశాడు.

వెస్టిండీస్ సారథి హోల్డర్ 10 ఓవర్లలో 104 పరుగులు ఇచ్చాడు. 1983లో మార్టిన్ స్నెడన్ 12 ఓవర్లు వేసి 105 పరుగులు ఇచ్చాడు. అయితే, పది ఓవర్లు వేసి హోల్డర్ 104 పరుగులు ఇచ్చాడు. ఇది చెత్త రికార్డ్.

వన్డే చరిత్రలో హోల్డర్ చెత్త రికార్డ్ ఐదవది. 2006లో ఆస్ట్రేలియాకు చెందిన లూయిస్ ఒక్క వికెట్ తీయకుండా 113 పరుగులు ఇచ్చాడు. హోల్డర్ తన చివరి రెండు ఓవర్లలో 64 పరుగులు ఇచ్చాడు. దీంతో సౌతాఫ్రికా చివరి ఇరవై ఓవర్లలో 261 పరుగులు, చివరి పది ఓవర్లలో 150 పరుగులు చేసింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X