న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్: చరిత్ర సృష్టించిన సంగక్కర, ఒకే ఒక్క ఆటగాడు... వరుసగా 4వ సెంచరీ

By Nageswara Rao

హోబర్ట్: ఐసీసీ వరల్డ్ కప్ పూల్ ఏలో భాగంగా హోబర్ట్‌లో స్కాట్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 3,631 వన్డేలు జరిగాయి. అయితే ప్రపంచంలో ఏ ఒక్క క్రికెటర్ కూడా వరుసగా నాలుగు సెంచరీలు సాధించలేదు.

బుధవారం ఈ రికార్డుని అందుకున్న ఏకైక ఆటగాడిగా శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర చరత్రి సృష్టించాడు. ఆస్టేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వరల్డ్ కప్‌లో వరుసగా వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్‌ సెంచరీలు సాధించాడు. అది కూడా ఒక రికార్డే.

కెరీర్‌లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్న కుమార సంగక్కర... తన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో పాటు అద్భుతాలు సృష్టిస్తున్నాడు. 86 బంతుల్లో 101 పరుగులు చేసిన సంగక్కరకు వన్డేల్లో ఇది 25వ సెంచరీ కాగా, ఈ ప్రపంచకప్‌లో వరుసగా నాల్గవ సెంచరీ.

World Cup: Kumar Sangakkara creates history with 4th successive century

అంతక ముందు మెల్ బోర్న్‌లో బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో (105*) పరుగులు చేయగా, వెల్లింగ్టన్‌లో ఇంగ్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో (117*) పరుగులు చేయగా, సిడ్నీలో ఆస్టేలియాపై 107 బంతుల్లో 104 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు వరల్డ్ కప్‌లో భారత్‌కు చెందిన సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 6 సెంచరీలు సాధించగా, రికీ పాంటింగ్ 5, సెంచరీలతో రెండో స్ధానంలో ఉన్నాడు. ఇక వన్డే ఫార్మెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కుమార సంగక్కర రెండో స్ధానంలో ఉన్నాడు.

శ్రీలంక జట్టు తరుపున 400వ వన్డే మ్యాచ్‌లాడిన ఆటగాళ్లలో కుమార సంగక్కర ఒకడు. వన్డేల్లో 14,000 మైలు రాయిని అధిగమించాడు. ఇక వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (18,426) పేరిట ఉంది.

స్కాట్లాండ్ విజయ లక్ష్యం 364:

ఐసీసీ వరల్డ్ కప్‌లో పూల్ ఏలో భాగంగా శ్రీలంక Vs స్కాట్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 363 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కుమార సంగక్కర, దిల్షాన్ సెంచరీలు చేశారు. దిల్షాన్ 97 బంతుల్లో 100 పరుగులు(9 ఫోర్లు, ఒక సిక్స్), సంగక్కర 86 బంతుల్లో 101 పరుగులు(9 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేశారు.

శ్రీలంక ఆటగాళ్లు దిల్షాన్ 104, సంగక్కర 124, మథ్య్సూ 51, పెరేరా 24, పరుగులు చేయగా కులశేఖర 18, చమీరా 13 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. స్కాట్లాండ్ బౌలర్లలో డెమి 3 వికెట్లు తీసుకోగా ఎవెన్స్ 2, బెరిగ్టన్ 2, మచన్ టైలర్ చెరో వికెట్ తీసుకున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X