న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరుసగా భారత్ నాలుగో విజయం: ధోనీ ఒంటరి పోరాటం

పెర్త్: ప్రపంచ కప్‌లో భాగంగా శుక్రవారం పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో వెస్టిండీస్ పైన గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 182 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తడపడుతూనే లక్ష్యాన్ని చేధించింది. కోహ్లీ (33), రైనా (22) ధోనీ (45) పరుగులు చేశారు. జడెజా, అశ్విన్‌లతో కలిసి ధోనీ ఆచితూచి ఆడుతూ టార్గెట్ రీచయ్యాడు. భారత్ 185 పరుగులు చేసింది.

అంతకుముందు.. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరుగుతున్న మ్యాచులో వెస్టిండీస్ నిర్దేశించిన 183 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ఆరంభంలోనే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. 8 ఓవర్లలో 20 పరుగులు చేసిన టీమిండియా 2 వికెట్లను కోల్పోయింది. రోహిత్ శర్మ 7, ధావన్ 9 పరుగులు చేసి టేలర్ బౌలింగ్‌లో ఔటయ్యారు. ఆ తర్వాత కొంత నిలకడగా ఆడిన విరాట్ కోహ్లీ.. రస్సెల్ బౌలింగ్‌లో 33 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం 14 పరుగులు చేసిన రహానే కూడా పెవిలియన్ చేరాడు.

ప్రస్తుతం ధోనీ 0, రైనా 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు 84.

అంతకుముందు హోల్డర్ అర్థశతకం సాధించడంతో 44.2 ఓవర్లలో 182 పరుగులు చేసింది వెస్టిండీస్. ఆరంభం నుంచి తడబడిన విండీస్, వెంట వెంటనే కీలక వికెట్లను కోల్పోయింది. కేవలం 8 పరుగులకే స్మిత్ వికెట్ కోల్పోయిన విండీస్ ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లను సమర్పించుకుంది. 133 పరుగులకు ఎనిమిది వికెట్లను కోల్పోయింది. ప్రమాదకర భ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్(21), స్మిత్(6) వికెట్లను భారత బౌలర్ షమీ పెవిలియన్ చేర్చాడు.

World Cup Match 28: West Indies bat first Vs India

రాందిన్‌ను భువనేశ్వర్ క్లీన్ బౌల్డ్ చేయగా, శామ్యూల్స్ 2 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. 9 పరుగులు చేసిన సిమన్స్ మోహిత్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సమి 26, కార్టర్ 21, రస్సెల్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం హోల్డర్ 57, టేలర్ 11 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టారు. హోల్డర్ బాధ్యతాయుతంగా ఆడి విండీస్‌ గౌరవప్రద స్కోరు చేసేందుకు కీలకంగా మారాడు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు తీయగా, యాదవ్, జడేజా రెండేసి వికెట్లు తీశారు. మోహిత్ శర్మ, అశ్విన్‌లు తలా ఓ వికెట్ తీశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X