న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్: సఫారీలపై సెంచరీ చేయని కోహ్లీ, ఈసారైనా చేస్తాడా?

By Nageswara Rao

మెల్‌బోర్న్: టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా జట్టుపై తన ప్రదర్శన ఆసంపూర్ణంగా ఉంది. ఐసీసీ వరల్డ్ కప్ 2015 పూల్ బీలో భాగంగా ఫిబ్రవరి 22(ఆదివారం) జరగనున్న మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని కోరుకుందాం.

2011 వరల్డ్ కప్ మాదిరే ఈ ఏడాది కూడా విరాట్ కోహ్లీ సెంచరీతో తన ఆటను ప్రారంభించాడు. 2011లో జరిగిన వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ చేసి, భారత్‌ను టైటిల్ ఛాంపియన్‌గా నిలబెట్టే వరకు అహర్నిశలు కష్టపడ్డాడు.

సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మళ్లీ మొదలైన వరల్డ్ కప్‌లో పాకిస్ధాన్‌పై జరిగిన మ్యాచ్‌‌లో సెంచరీ (107) పరుగులు చేసి భారత్‌కు 76 పరుగుల విజయాన్ని అందించాడు. ఈ గెలుపు చరిత్రను కొనసాగించింది.

ప్రస్తుతం టీమిండియా దృష్టంతా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న దక్షిణాఫ్రికా మ్యాచ్ పైనే ఉంది. గత మూడు వరల్డ్ కప్స్‌లో దక్షణాఫ్రికాతో తలపడిన భారత్ మూడు సార్లు పరాజయాన్ని చవిచూసింది. ఈసారి మాత్రం ఎలగైనా దక్షిణాఫ్రికాపై విజయం సాధించాలనే పట్టుదలతో ఆటగాళ్లు ఉన్నారు.

అంతర్జాతీయ వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లీ 22 సెంచరీలు చేసి మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ రికార్డుని సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 49, రికీ పాంటింగ్ 30, సనత్ జయసూర్య 28 ఆ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు.

విరాట్ కోహ్లీ చేసిన ఈ 22 సెంచరీల్లో ఒక్క సెంచరీ కూడా దక్షిణాఫ్రికాపై లేక పోవడం కోహ్లీకి నిరాశ కలిగించే అంశం. అయితే ఆదివారం నాడు మెల్ బోర్న్‌లో జరగనున్న మ్యాచ్ లో కోహ్లీ దక్షిణాఫ్రికాపై సెంచరీ చేయాలని యావత్ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాపై 13 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు 87.

World Cup: Virat Kohli has unfinished work against South Africa

దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ ట్రాక్ రికార్డు (ఫిబ్రవరి 19, 2015 వరకు)

ఆడిన మ్యాచ్‌లు: 13 (ఇన్నింగ్స్ 11), 1 నాటౌట్
పరుగులు: 344, అత్యధికం - 87*
సెంచరీలు - 0, అర్ధ సెంచరీలు - 3
యావరేజి - 34.40, స్టైయిక్ రేట్ - 77.47

విరాట్ కోహ్లీ 22 సెంచరీలు (8 మొదట బ్యాటింగ్ చేసినప్పుడు, 14 సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు):

శ్రీలంక - 6
వెస్టిండిస్/ఆస్టేలియా/బంగ్లాదేశ్ - 3
పాకిస్ధాన్/ ఇంగ్లాండ్/ న్యూజిలాండ్ - 2
జింబాబ్వే- 1

వరల్డ్ కప్‌లో సెంచరీలు - 2 (బంగ్లాదేశ్, పాకిస్ధాన్‌పై చెరొకటి)

గమనిక: ఇందులో 20 సెంచరీలు టీమిండియా విజయానికి తోడ్పడ్డాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X