హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జల్సాకోసం 1.49కోట్లు: ఏటీఎంలలో చోరీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు ఏటిఎంల కష్టోడియన్లు దాదాపు రూ. 1.5కోట్ల మోసానికి పాల్పడ్డారు. వీరిద్దరిని పోలీసులు అదుపులోకి విచారించడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డిసిపి మల్కాజిగిరి రమారాజేశ్వరి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ముసారాంబాగ్ ప్రాంతానికి చెందిన మద్దెల సుధీర్‌కుమార్(24), నెరేడ్‌మెట్ ప్రాంతానికి చెందిన ముత్తా అశోక్(26) సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థలో కస్టోడియన్‌లుగా పని చేస్తున్నారు.

వీరిద్దరు ఈసీఐఎల్ ప్రాంతంలోని ఎస్‌బీహెచ్, యూనియన్ బ్యాంక్‌లకు సంబంధించి 24 ఏటీఎంల్లో రోజూ నగదును డిపాజిట్ చేస్తారు. సీఎంఎస్ సంస్థ ఈ ఇద్దరికి ఏటీఎం మెషిన్ చెస్ట్ తెరిచేందుకు వేర్వేరు కోడ్‌లను ఇస్తారు. ఈ రహస్య కోడ్‌ల ద్వారానే కస్టోడియన్‌లు వాటిని ఆపరేట్ చేసి చెస్ట్ మెషీన్‌ను తెరిచి అందులో నగదును డిపాజిట్ చేస్తారు.

ఈ కోడ్‌లను కూడా ఒకరికొక్కరు షేర్ చేసుకోవద్దనే నిబంధన ఉంది. సుధీర్ కుమార్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడడంతో తన తోటి కస్టోడియన్ అశోక్‌తో కలిసి కుట్రపన్నాడు. రోజు ఉదయం పూట ఏటీఎంల్లో క్యాష్ డిపాజిట్ చేసిన తర్వాత వీరికి అవసరం ఉన్నప్పుడుల్లా కోడ్‌ల ద్వారా చెస్ట్ ఓపెన్ చేసి రూ. లక్షల్లో నగదును చోరీ చేస్తున్నారు.

ఇలా గత డిసెంబరు నుంచి ఈ ఏప్రిల్ వరకు మొత్తం రూ. 1.49 కోట్ల నగదును దోచేశారు. ఈ దొంగతనాల కోసం సుధీర్‌కుమార్ తన స్నేహితుడు మనోజ్‌ను జతగా చేర్చుకున్నాడు. ఇలా దోచేసిన డబ్బును సుధీర్ రూ. 1.14 కోట్లు, అశోక్ రూ. 9 లక్షలు, మనోజ్ రూ. 25లక్షలను పంచుకున్నారు. ఇటీవల సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థ జరిపిన వార్షిక ఆడిట్ రిపోర్టులో క్యాష్‌లో తేడాలు రావడంతో ఈ గుట్టు బయటపడింది. మేనేజర్ శామ్సన్ రోజర్ ఫిర్యాదు మేరకు నాచారం పోలీసులు రంగంలోకి దిగి ఈ కస్టోడియన్‌ల గుట్టును రట్టు చేశారు.

ఏటిఎంలకు ఉద్యోగుల కన్నం

ఏటిఎంలకు ఉద్యోగుల కన్నం

జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు ఏటిఎంల కష్టోడియన్లు దాదాపు రూ. 1.5కోట్ల మోసానికి పాల్పడ్డారు.

ఏటిఎంలకు ఉద్యోగుల కన్నం

ఏటిఎంలకు ఉద్యోగుల కన్నం

వీరిద్దరిని పోలీసులు అదుపులోకి విచారించడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఏటిఎంలకు ఉద్యోగుల కన్నం

ఏటిఎంలకు ఉద్యోగుల కన్నం

డిసిపి మల్కాజిగిరి రమారాజేశ్వరి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ముసారాంబాగ్ ప్రాంతానికి చెందిన మద్దెల సుధీర్‌కుమార్(24), నెరేడ్‌మెట్ ప్రాంతానికి చెందిన ముత్తా అశోక్(26) సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థలో కస్టోడియన్‌లుగా పని చేస్తున్నారు.

ఏటిఎంలకు ఉద్యోగుల కన్నం

ఏటిఎంలకు ఉద్యోగుల కన్నం

వీరిద్దరు ఈసీఐఎల్ ప్రాంతంలోని ఎస్‌బీహెచ్, యూనియన్ బ్యాంక్‌లకు సంబంధించి 24 ఏటీఎంల్లో రోజూ నగదును డిపాజిట్ చేస్తారు.

సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థ ఉద్యగులైన సుధీర్ కుమార్, అశోక్ తమ రూటులో ఏటీఎం లావాదేవిలు తక్కువగా ఉండి, సెక్యూరిటీ లేని కేంద్రాలను ఎంచుకుంటారు. ఆ కేంద్రాల్లోనే ఇద్దరు వెళ్లి తమ కోడ్‌ల ద్వారా చెస్ట్‌ను ఓపెన్ చేసి అందులోంచి కనీసం రూ. 5 లక్షలను తీస్తారు. ఆ తర్వాత యథావిధిగా చెస్ట్‌ను మూసేస్తారు.

అదేవిధంగా ఏటీఎం క్యాష్ డిపాజిట్‌కు సంబంధించి ఆడిట్ కోసం వచ్చే అధికారుల సమాచారం వీరి వద్ద ఉండడంతో అప్రమత్తమై లెక్కింపులో తేడాలు ఉండకుండా మరో ఏటీఎం నుంచి నగదును తీసుకువచ్చి తేడాలు రాకుండా సర్దేవారు. ఇలా ఆడిట్ లెక్కలో కూడా ఎవరీకి అనుమానం రాకుండా ఉండేందుకు ఈ ఇద్దరు తమ మాస్టర్ ప్లాన్‌తో ఉన్నతాధికారులను బురిడీ కొట్టించారు.

సుధీర్‌కుమార్ వ్యవహరంలో సీఎంఎస్ సంస్థకు చెందిన మరొకొంత మంది అధికారుల పాత్ర పై పోలీసులపై అనుమానిస్తున్నారు. రోజు ఏటీఎంలో ఎంత క్యాష్ డిపాజిట్ చేస్తున్నారు, ఎంత విత్ డ్రా అవుతున్న వివరాలు ఉన్నప్పటికీ ఈ చోరీని ఎందుకు గుర్తించలేకపోయారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా పోలీసులు సూచించిన గైడ్ లైన్స్ పాటించని సీఎంఎస్ సంస్థతో పాటు ఏటీఎం కేంద్రాలు, బ్యాంక్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నట్లు డిసిపి రమారాజేశ్వరి చెప్పారు.

English summary
Three persons, including two employees of CMS (Cash Management Services), a company engaged in loading cash into ATMs in the city, were arrested on Monday on the charges of siphoning off money to the tune of Rs 1.49 crore from ATMs of different banks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X