విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిమ గల నాణెం పేరుతో రూ. 20 లక్షలకు టోకరా (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: మహిమ గల నాణెం అని నమ్మించి రూ. 20 లక్షలు కాజేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు క్రైమ్ డీసీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు. బ్యారెక్స్‌లో పోలీసు సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

జిల్లాలోని రావికమతం మండలానికి చెందిన మామిడి అర్జునరావు, ఆనందపురం మండలం వేముల వలసకు చెందిన కె. రమేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు. వీరి వద్ద బుచ్చెయ్యపేటకు చెందిన ఆదిశేషుకుమార్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

వీరితో పాటు ముత్యాల పోతురాజు, మరో ఇద్దరు కలిసి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకి చెందిన జంగా రాజిరెడ్డి అనే వ్యక్తి వద్దకు వెళ్లారు. తమ వద్ద మహిమ గల సీతారాముల కాలం నాటి పట్టాభిషేకం నాణెం ఉందని, అది ఎవరి వద్ద ఉంటే వారు ఐశ్వర్య వంతులు అవుతారని నమ్మించారు.

మహిమ గల నాణెం పేరుతో రూ. 20 లక్షలకు టోకరా

మహిమ గల నాణెం పేరుతో రూ. 20 లక్షలకు టోకరా


బహిరంగ మార్కెట్‌లో దీని విలువ రూ. 2 కోట్లు ఉంటుందని చెప్పి, పలు దఫాలుగా రాజారెడ్డి నుంచి రూ. 20 లక్షలు వసూలు చేసి ఆ నాణేన్ని అతడికి ఇచ్చారు. అయితే సదరు నాణేన్ని పరీక్షించుకున్న రాజారెడ్డి ఎటువంటి మహిమలు లేవని తెలుసుకుని, తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 మహిమ గల నాణెం పేరుతో రూ. 20 లక్షలకు టోకరా

మహిమ గల నాణెం పేరుతో రూ. 20 లక్షలకు టోకరా

దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నగరంలోని ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద అర్జునరావు, రమేశ్, ఆదిశేషు కుమార్‌‌లను అదుుపలోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్టు అంగీకరించారు. దీంతో నిందితుల నుంచి పోలీసులు రూ. 8.5 లక్షలు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

 మహిమ గల నాణెం పేరుతో రూ. 20 లక్షలకు టోకరా

మహిమ గల నాణెం పేరుతో రూ. 20 లక్షలకు టోకరా


కాగా, మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఈ నాణేనికి ఒకవైపు 1818, ఈస్టిండియా కంపెనీ అని ఉంటుందని, మరో వైపు రాములవారి పట్టాభిషేకం బోమ్మ ఉంటుందని తెలిపారు.

 మహిమ గల నాణెం పేరుతో రూ. 20 లక్షలకు టోకరా

మహిమ గల నాణెం పేరుతో రూ. 20 లక్షలకు టోకరా


ఇది సాధారణ రాగి నాణెమని, ఇటువంటి నాణేలు భద్రాచలంలో విరివిగా దొరుకుతాయని వెల్లడించారు. ప్రజలు ఇలాంటి మహిమ గల నాణెల గురించి ఎవరూ చెప్పినా విని మోసపోవద్దని కోరారు.

English summary
The city police arrested three of the six-member gang Friday who had been conning public by promising them a fortune. The gang traded in ancient coins. The arrested have been identified as M Arjuna Rao of Ravikamatam mandal, K Ramesh of Anandapuram mandal, A Syam Kumar of Butchayyapeta mandal. Another accused M Pothuraju is absconding and two others are yet to be identified.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X