హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టార్టప్‌ల కేంద్రంగా హైదరాబాద్: కెటిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్టార్టప్‌ల కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కె తారక రామారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన, ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ ఇంక్యూబేటర్ (టి హబ్) ఏర్పాటు పనులకు శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఐఐటీ క్యాంపస్ ఆవరణలో కెటిఆర్ భూమి పూజ నిర్వహించారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, కొత్త ఐటీ ఆవిష్కరణలకు పెద్ద పీట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఐటీ రంగాన్ని రాష్ట్రంలో మరింత విస్తరించేందుకు తెలంగాణ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), నల్సార్ యూనివర్సిటీలతో సంయుక్తంగా టి హబ్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

యానిమేషన్, ఇంక్యూబేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని టి హబ్ పని చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. కొత్త ఆలోచనలకు కేంద్రంగా టి హబ్ మారుతుందని అన్నారు. ప్రపంచంలో ఎవరు కొత్త స్టార్టప్ సృష్టించినా అది హైదరాబాద్‌నుంచి ఉండేలా టీహబ్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ 2018 నాటికి దేశంలోనే స్టార్టప్ కేంద్రంగా ఎదుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టి హబ్ మొదటి దశ పనులను జూన్ 2లోపు ఐఐఐటీ ఆవరణలో చేపట్టనున్నట్లు చెప్పారు. రూ.35 కోట్లతో 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మొదటి దశలో చేపట్టే టీ హబ్ ద్వారా 2017నాటికి 400 స్టార్టప్‌లు, 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

కెటిఆర్

కెటిఆర్

స్టార్టప్‌ల కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కె తారక రామారావు తెలిపారు.

కెటిఆర్

కెటిఆర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన, ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ ఇంక్యూబేటర్ (టి హబ్) ఏర్పాటు పనులకు శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఐఐటీ క్యాంపస్ ఆవరణలో కెటిఆర్ భూమి పూజ నిర్వహించారు.

కెటిఆర్

కెటిఆర్

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, కొత్త ఐటీ ఆవిష్కరణలకు పెద్ద పీట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

కెటిఆర్

కెటిఆర్

ఐటీ రంగాన్ని రాష్ట్రంలో మరింత విస్తరించేందుకు తెలంగాణ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

కెటిఆర్

కెటిఆర్

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), నల్సార్ యూనివర్సిటీలతో సంయుక్తంగా టి హబ్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

కెటిఆర్

కెటిఆర్

యానిమేషన్, ఇంక్యూబేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని టి హబ్ పని చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.

కెటిఆర్

కెటిఆర్

కొత్త ఆలోచనలకు కేంద్రంగా టి హబ్ మారుతుందని అన్నారు. ప్రపంచంలో ఎవరు కొత్త స్టార్టప్ సృష్టించినా అది హైదరాబాద్‌నుంచి ఉండేలా టీహబ్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

కెటిఆర్

కెటిఆర్

హైదరాబాద్ 2018 నాటికి దేశంలోనే స్టార్టప్ కేంద్రంగా ఎదుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కెటిఆర్

కెటిఆర్

టి హబ్ మొదటి దశ పనులను జూన్ 2లోపు ఐఐఐటీ ఆవరణలో చేపట్టనున్నట్లు చెప్పారు.

కెటిఆర్

కెటిఆర్

రూ.35 కోట్లతో 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మొదటి దశలో చేపట్టే టీ హబ్ ద్వారా 2017నాటికి 400 స్టార్టప్‌లు, 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

English summary
Telangana Minister for Information Technology, KTR today laid foundation stone at IIIT, Gachibowli for T Hub. After performing bhoomi puja, speaking to scribes, KTR said draft on IT policy is ready and by June first phase of Telangana Hub will be completed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X