వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

46 మంది అస్వస్థతకు కారణం అదే: విద్యార్థినులకు కిషన్‌రెడ్డి పరామర్శ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అడ్డగుట్ట మహేంద్రహిల్స్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్ధినిలు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అస్వస్థతకు గురైన విద్యార్ధినులు నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వాంతులు, విరేచనాలు, జ్వరంతో సోమవారం 46మంది ఆసుపత్రిలో చేరగా, మంగళవారం మరో పది మంది విద్యార్థినులు ఆసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చికిత్స పొందుతున్న విద్యార్ధినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

విద్యార్ధినులకు మెరుగైన వైద్యం అందించాలని ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.శంకర్‌కు సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

పుడ్ పాయిజన్‌కు కారణం అదే

పుడ్ పాయిజన్‌కు కారణం అదే


మహేంద్రహిల్స్‌లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌లో సమారు 650 మంది విద్యార్ధినులు ఉంటున్నారు. ఆదివారం ఉదయం టిఫిన్‌గా పూరి, ఉప్మా, మధ్యాహ్నాం ఫ్రైడ్ రైస్, ఎగ్ కర్రి, రాత్రి వంకాయ కూరగాయలతో కూడిన భోజనాన్ని తిన్నారు.

 పుడ్ పాయిజన్‌కు కారణం అదే

పుడ్ పాయిజన్‌కు కారణం అదే


అయితే రాత్రి నుంచి హాస్టల్‌లో విద్యార్ధినులు తీవ్ర అస్వస్ధతకు గురికావడంతో ఓ విద్యార్ధినిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

పుడ్ పాయిజన్‌కు కారణం అదే

పుడ్ పాయిజన్‌కు కారణం అదే


ఇదిలా ఉండగా, సోమవారం ఉదయం నుంచి హాస్టల్‌లో సుమారు 100కు పైగా విద్యార్ధినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

పుడ్ పాయిజన్‌కు కారణం అదే

పుడ్ పాయిజన్‌కు కారణం అదే


సమాచారం తెలుసుకున్న హాస్టల్ నిర్వాహకులు వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం అస్వస్థత గురైన విద్యార్ధినులను గాంధీకి తరలించారు.

 పుడ్ పాయిజన్‌కు కారణం అదే

పుడ్ పాయిజన్‌కు కారణం అదే


ముందస్తుగా అడ్డగుట్ట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులకు సమాచారం ఇవ్వడంతో కాలేజీకి చేరుకున్న అర్బన్ హెల్ సెంటర్ వైద్యులు ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి విద్యార్ధునులను ఫీవర్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా ఆదేశించారు.

 పుడ్ పాయిజన్‌కు కారణం అదే

పుడ్ పాయిజన్‌కు కారణం అదే


విద్యార్ధినులకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ముందు జాగ్రత్తల్లో బాగంగా నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి ఉదయం 11 గంటలకు 19 మంది విద్యార్ధినులు, 2 గంటలకు 26 మందిని తరలించారు.

పుడ్ పాయిజన్‌కు కారణం అదే

పుడ్ పాయిజన్‌కు కారణం అదే


ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధినుల శాంపిల్స్‌ను తీసుకుని ల్యాబ్‌కు పంపించారు. వైద్య చికిత్సలు అందించి, ఇంజక్షన్స్ ఇచ్చిన తర్వాత విద్యార్ధినులకు పండ్లు పంపిణీ చేశారు.

పుడ్ పాయిజన్‌కు కారణం అదే

పుడ్ పాయిజన్‌కు కారణం అదే

హాస్టల్‌లోని వాటర్ ట్యాంక్‌ను సరైన రీతిలో శుభ్రపరచకపోవడం, డ్రైనేజీ పైప్ లైన్ వ్యవస్ధ కలుషితం కావడంతో విద్యార్ధినులకు మంచినీటి సరఫరా సక్రమంగా అందడం లేదన్నారు.

పుడ్ పాయిజన్‌కు కారణం అదే

పుడ్ పాయిజన్‌కు కారణం అదే

వాటర్ ట్యాంకర్‌లో క్లోరిన్ ఎక్కువగా కలపడం వల్లే విద్యార్ధినులు భోజనం చేసిన తర్వాత ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురయ్యారని వైద్యులు నివేదికలో పేర్కొన్నారు.

English summary
The students from the Social Welfare Residential School and Junior College, Mahendra Hills, Secunderabad, said that, they had consumed fried rice along with egg curry on Sunday evening and khichdi early morning on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X