హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భాగ్యనగరికి తలమాణికం: ధూల్‌పేటలో భారీ హనుమాన్ విగ్రహం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని ధూల్‌పేట ఆకాశపురి హనుమాన్‌ మందిరం భాగ్యనగరికి తలమానికమని సాధ్వీ ప్రాచీ అన్నారు. మంగళ్‌హాట్‌లోని అప్పర్‌ ధూల్‌పేట గంగాబౌలీలో నిర్మించిన 51 అడుగుల భారీ హనుమంతుడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సాధ్వీ దేవ ఠాకూర్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు.

గురువారం వేలాది మంది భక్తుల పంచముఖ ఆంజనేయ స్వామి, పంచముఖ శివలింగాల ప్రతిష్ఠ జరిగింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నో కష్టాలను ఎదుర్కొని అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించారని కొనియాడారు.

సాధ్వి దేవ ఠాకూర్ మాట్లాడుతూ.. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఎమ్మెల్యే ఈ హనుమాన్ విగ్రహాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే రాజాసింగ్ కుటుంబ సభ్యులతో కలిసి యజ్ఞం నిర్వహించారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ్‌ మాట్లాడుతూ.. కళాకారులు లక్ష్మీనారాయణ్‌సింగ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా విశాల్‌ శోభాయాత్ర ఆకాశపురి హనుమాన్‌ ఆలయం నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

ధూల్‌పేట ప్రాంతాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. అకారణంగా అరెస్ట్ చేసిన హిందూ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే శోభాయాత్రను పాతబస్తీకి తరలించి భాగ్యలక్ష్మి ఆలయం ఎదుట సభ నిర్వహిస్తామని హెచ్చరించారు.

కాగా, ఎత్తైన ఆకాశ్‌పురి హనుమాన్‌ ఆలయం హై రేంజ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ధ్రువీకరణ పత్రాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథ్‌కు దైవజ్ఞశర్మ చేతుల మీదుగా అందించినట్లు సంస్థ సీఈవో సుమన్‌ పల్లె తెలిపారు.

ధూల్‌పేటలో భారీ హనుమాన్ విగ్రహం

ధూల్‌పేటలో భారీ హనుమాన్ విగ్రహం

ధూల్‌పేట ఆకాశపురి హనుమాన్‌ మందిరం భాగ్యనగరికి తలమానికమని సాధ్వీ ప్రాచీ అన్నారు.

ధూల్‌పేటలో భారీ హనుమాన్ విగ్రహం

ధూల్‌పేటలో భారీ హనుమాన్ విగ్రహం

మంగళ్‌హాట్‌లోని అప్పర్‌ ధూల్‌పేట గంగాబౌలీలో నిర్మించిన 51 అడుగుల భారీ హనుమంతుడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సాధ్వీ దేవ ఠాకూర్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు.

ధూల్‌పేటలో భారీ హనుమాన్ విగ్రహం

ధూల్‌పేటలో భారీ హనుమాన్ విగ్రహం

గురువారం వేలాది మంది భక్తుల పంచముఖ ఆంజనేయ స్వామి, పంచముఖ శివలింగాల ప్రతిష్ఠ జరిగింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నో కష్టాలను ఎదుర్కొని అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించారని కొనియాడారు.

ధూల్‌పేటలో భారీ హనుమాన్ విగ్రహం

ధూల్‌పేటలో భారీ హనుమాన్ విగ్రహం

సాధ్వి దేవ ఠాకూర్ మాట్లాడుతూ.. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఎమ్మెల్యే ఈ హనుమాన్ విగ్రహాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే రాజాసింగ్ కుటుంబ సభ్యులతో కలిసి యజ్ఞం నిర్వహించారు.

ధూల్‌పేటలో భారీ హనుమాన్ విగ్రహం

ధూల్‌పేటలో భారీ హనుమాన్ విగ్రహం

ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ్‌ మాట్లాడుతూ.. కళాకారులు లక్ష్మీనారాయణ్‌సింగ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా విశాల్‌ శోభాయాత్ర ఆకాశపురి హనుమాన్‌ ఆలయం నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

ధూల్‌పేటలో భారీ హనుమాన్ విగ్రహం

ధూల్‌పేటలో భారీ హనుమాన్ విగ్రహం

ధూల్‌పేట ప్రాంతాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు.

English summary
A 51-ft Hanuman statue has come up on a 150-ft high hill, at Akashpuri in Dhoolpet area of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X