వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్.. వీటిల్లో జాబ్ కావాలా?

గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల్లో ఉద్యోగం ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఆయా రంగాల్లో ప్రధానంగా ఏడు నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇంజనీరింగ్ పూర్తి కాగానే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేయాలని చాలామంది విద్యార్థులు ఆశిస్తుంటారు. అది కూడా గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలైతే ఎగిరి గంతేస్తారు. ఈ కంపెనీల్లోనే కాదు ఎక్కడ ఉద్యోగం చేయాలన్నా ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగి ఉండడం చాలా ముఖ్యం.

నైపుణ్యం ఉన్న అభ్యర్థులను ఆయా సంస్థలు ఏరి కోరి ఎంపిక చేసుకుంటుంటాయి. ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, డిజైనర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు... ఇలా అనేక రంగాల్లో ఉద్యోగాల కోసం వెతుకుతున్న అభ్యర్థులకు ఆయా రంగాల్లో ప్రధానంగా ఏడు నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలని చెబుతున్నారు.

అవేమిటంటే...

ఇంజనీర్లయితే.. సీ/సీ++/సీ#, జావా, సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్, పైథాన్, జావా స్క్రిప్ట్, ఎజైల్ మెథడాలజీస్, ఎస్ క్యూ ఎల్... వీటిలో నైపుణ్యం ఉండాలి.

ఒకవేళ అభ్యర్థులు ప్రొడక్ట్ మేనేజర్లు అయితే.. ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, లీడర్ షిప్, కస్టమర్ సర్వీస్, స్ట్రాటజీ, క్లౌడ్ కంప్యూటింగ్, ప్రొడక్ట్ మార్కెటింగ్, ఎంటర్ ప్రైజ్ మార్కెటింగ్.. వీటిలో నైపుణ్యం ఉండాలి.

7 skills you should have to get a job at Google, Apple, or Microsoft

డాటా సైంటిస్టులకేమో... డాటా అనాలసిస్, ఎస్ క్యూ ఎల్, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, మెషిన్ లెర్నింగ్, డాటా మైనింగ్, బిజినెస్ అనాలసిస్, పైథాన్.. లలో నిపుణులై ఉండాలి.

ఇక డిజైనర్లకయితే... యూజర్ ఇంటర్ ఫేస్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, వెబ్ డిజైన్, ఫొటోషాప్, ఇలస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్, ఆర్ట్ డైరెక్షన్.. రంగాల్లో నిష్ణాతులై ఉండాలి.

ఐటీ దిగ్గజాలుగానీ మరే ఇతర కంపెనీలుగానీ ఆచి తూచి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటుంటాయి. కొన్ని సంస్థలు సరైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి రిక్రూటింగ్ సంస్థలతో టై అప్ చేసుకుంటాయి. అందులో పేసా డాట్ కామ్ అనే సంస్థ కూడా ఒకటి.

ఈ సంస్థ ఆయా ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వారికి సంబంధించి లక్షలదాది బయోడేటాలను విశ్లేషిస్తుంది. ఆ తరువాత భాగస్వామి సంస్థలకు అవసరమైన సమాచారాన్ని అందజేస్తుంది.

ప్రధానంగా గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బయోడేటాలను నిశితంగా విశ్లేషించి వారి నైపుణ్యాల గురించి ఓ అంచనాకు వస్తుంది. దీనిని బట్టి అయా సంస్థలు అనుసరించే విధానాలు, వారికి అవసరమైన నైపుణ్యాలు ఏమిటో తెలిసిపోతుంది కాబట్టి వాటి అధారంగా అభ్యర్థుల అర్హతలు, నైపుణ్యాలను అంచనా వేయగలుగుతుంది.

గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్... ఈ మూడు కంపెనీలు మంచి ప్రమాణాలు పాటిస్తాయని అమెరికాకు చెందిన 'బిజినెస్ ఇన్ సైడర్' ప్రకటించింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ కంపెనీలో 1.20,849 మంది నిపుణులు, ఆపిల్ సంస్థలో 1,00,000 మంది నిష్ణాతులు, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ లో 61,000 మంది నిపుణులు పనిచేస్తున్నారు.

ఇలాంటి సంస్థల్లో చేరాలంటే... అసలు ఆయా సంస్థలకు అవసరమైన నైపుణ్యాలు ఏమిటి? టెక్ కంపెనీలు అభ్యర్థుల నుంచి ఏం కోరుకుంటున్నాయి? తదితర విషయాలపై అభ్యర్థులకు కూడా కాస్తయినా అంచనా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇవి తెలిస్తే వాటికనుగుణంగా టెకీలు సిద్ధమవడం సులువు అవుతుందని వారి సలహా.

English summary
You'll need a very particular set of skills if you want to get a job at some of the most competitive tech companies out there. Just look at the data compiled by job site Paysa . The site has reviewed tens of millions of resumes, provided by a combination of Paysa's partners, recruiters, and users. Paysa took a closer look at the resumes of people who work at Google, Apple, and Microsoft, to get a sense of what skills those employees had in common.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X