హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యజమాని ఇంట్లో చోరీ: దంపతుల అరెస్ట్(ఫొటో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇంట్లో పని మనుషులుగా చేరి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ జంటను మాదాపూర్ క్రైం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితులు ఓ ఇంటి నుంచి అపహరించిన రూ. 5లక్షల నగదు, రూ. 5లక్షల విలువచేే బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన ఎ. రవికుమార్(28), అతని భార్య లీలావతి(24) కూలీ పనులు చేస్తుంటారు.

నాలుగు నెలల క్రితం వీరు మాదాపూర్, అయ్యప్ప సొసైటీలోని బొల్లినేని హోం అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మంజుశ్రీ ఇంట్లో పనికి కుదిరారు. నమ్మకంగా పనిచేస్తున్నారు. అక్టోబర్ 10న యజమాని బయటకు వెళ్లిన సమయంలో బెడ్‌రూంలోని అల్మారా తెరిచి అందులోని బంగారు ఆభరణాలు, నగదు తీసుకుని పారిపోయారు. ఇంటికొచ్చిన మంజుశ్రీ చోరీ జరిగినట్టు గ్రహించింది. పని మనుషులు కనిపించకపోవడంతో అనుమానమొచ్చి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

A Couple arrested for theft

కాగా, దొంగతనానికి పాల్పడ్డ దంపతులు అదే రోజు రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ వెళ్లారు. అక్కడినుంచి మంత్రాలయం, శ్రీశైలం వెళ్లారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల ఫోన్ నెంబర్ ఆధారంగా ఆచూకీ కనుగొన్నారు.

బంధువుల ఇంటికి వెళ్లేందుకు బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఎల్‌బినగర్‌లోని బస్టాండ్‌లో వేచి ఉండగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను క్రైం ఇన్‌స్పెక్టర్ నర్సింహారావు వెల్లడించారు.

English summary
A Couple arrested for theft in LB Nagar, Hyderabad on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X