హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తల్లిదండ్రుల నిర్లక్ష్యం: మొదటి అంతస్తుపైనుంచి పడిన చిన్నారి

తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఆ చిన్నారి ప్రాణాలకు మీదకు తెచ్చింది. ఎవరూ గమనించకపోవడం 18 నెలల చిన్నారి ఆడుకుంటూ రెండో అంతస్తు నుంచి కిందపడి తీవ్రగాయాలలైంది. ఈ ఘటన నగరంలోని బహదూర్‌పురాలో చోటు చేసుకుంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఆ చిన్నారి ప్రాణాలకు మీదకు తెచ్చింది. ఎవరూ గమనించకపోవడం 18 నెలల చిన్నారి ఆడుకుంటూ మొదటి అంతస్తు నుంచి కిందపడి తీవ్రగాయాలలైంది. ఈ ఘటన నగరంలోని బహదూర్‌పురాలో చోటు చేసుకుంది.

గత ఆదివారం ఉదయం బహదూర్‌పురాలోని ఓ ఇంటి మొదటి అంతస్తుపైనుంచి 18నెలల చిన్నారి కిందపడిపోయింది. ఎవరూ గమనించని కారణంగానే ఆమె ఆడుకుంటూ పొరపాటున కిందపడిపోయింది. కాగా, ఆ చిన్నారి కేకలు విన్న పొరిగింటివారు ఆమెను వెంటనే దగ్గరకు తీసుకున్నారు.

A girl child fell in the ground from house second floor

చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంత పిలిచినా, డోర్ బెల్ కొట్టినా ఫలితం లేకపోయింది. కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డైంది. తల్లిదండ్రుల నుంచి స్పందన రాకపోవడంతో పొరిగింటివారే ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది.

తల్లిదండ్రులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి రోడ్డుపై పడిన సమయంలో అటువైపు ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికలంటున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
A girl child fell in the ground from house second floor, Hyderabad on sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X