హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిషన్ రెడ్డి భార్య ఖాతా నుంచి డబ్బు కాజేసేయత్నం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సతీమణి బ్యాంకు ఖతా నుంచి డబ్బులను కాజేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని శుక్రవారం కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్‌పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి భార్య కావ్యకు ఆంధ్రా బ్యాంకు పంజాగుట్ట బ్రాంచీలో బ్యాంకు ఖాతా ఉంది.

గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం రూ. 10లక్షల చెక్కును తెచ్చి డబ్బులను తీసుకోవడానికి ప్రయత్నించాడు. బ్యాంక్ మేనేజర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించి కిషన్ రెడ్డికి సమాచారం అందించారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడ్ని విచారిస్తున్నారు.

సెల్‌ఫోన్ల ఐఎంఈ నెంబర్లు మారుస్తున్న వ్యక్తి అరెస్ట్

A man allegedly attempted to theft money in bank

సెల్‌ఫోన్ల ఐఎఈఐ నెంబర్లు మార్చి మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని గాంధీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. అలీబాగ్‌లో ఉండే మహ్మద్ రషీద్(34), మొబైల్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు.

కాగా, అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో తన వద్దకు వచ్చే కస్టమర్ల సెల్‌ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లు మార్చుతూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో రమేష్ అనే వ్యక్తికి సంబంధించిన ఫోన్ ఐఎంఈఐ నెంబర్లు మార్చాడు.

దీంతో రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు రషీద్ గురువారం బన్సిలాల్‌పేట్ జబ్బర్ కాంప్లెక్స్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో విషయం బయటపడింది. నిందితుడి వద్ద ఒక ఎల్ఈడి మానిటర్, సిపియూ, సెల్‌ఫోన్, కేబుల్స్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

English summary
A man allegedly attempted to theft money in MLA Kishan Reddy's wife's bank account on Friday and arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X