హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్న కూతురుపై తండ్రి అత్యాచారం: అనుమానంతో భార్య హత్య

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కన్న కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని గురువారం అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఎల్ఎల్‌నగర్‌లో నివసించే సయ్యద్ రషీద్(40) పెయింటర్‌గా పని చేస్తున్నాడు. అతని కూతురు స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కాగా, రషీద్ ఆమెపై మూడు రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడు.

విషయం బయటకు చెబితే చంపుతానంటూ ఆమెను బెదిరించాడు. అంతేగాక, మరో యువకుడితో సంబంధం ఉందంటూ కుమార్తెను రెండు రోజులుగా తీవ్రంగా కొడుతున్నాడు. దీంతో తల్లి కుమార్తెను ప్రశ్నించగా.. తండ్రి తనపై ఇప్పటికే రెండు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది.

దీనిపై నిలదీసే ప్రయత్నం చేసిన బాధితురాలి తల్లిని కూడా కొట్టాడు. దీంతో బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు రషీద్‌ను అరెస్ట్ చేశారు. కేసు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

A man arrested for allegedly raped his daughter

అనుమానంతో భార్యను చంపిన భర్త

అనుమానం పెనుభూతమై ఓ వివాహిత ప్రాణం తీసింది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గురువారం జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్‌మెట్‌కు చెందిన కారు డ్రైవర్ చింతల వెంకటేష్, మల్కాజిగిరికి చెందిన రేణుక(22)కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది.

మూడేళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. వెంకటేష్ రెండు నెలల క్రితం భార్యను తీసుకుని కాప్రా ఎల్లారెడ్డిగూడ పరిధిలోని మాలబస్తీకి నివాసం మార్చాడు. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై వెంకటేష్ అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంపై పలుమార్లు ఇరువురి మధ్య గొడవలు జరిగాయి.

కాగా, ఆగస్టు 26న రాత్రి కూడా వెంకటేష్ తన భార్యతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. భార్య నిద్రిస్తుండగా ఆమె చున్నీతో గొంతుకు ఉరివేసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

English summary
A man arrested on Thursday, for allegedly raped his daughter in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X