వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెర్సీ కిల్లింగ్‌కు అనుమతించండి: కొడుకు బాధ చూడలేని ఓ తల్లి ఆవేదన

ఓ తల్లి తన కుమారుడి బాధ చూడలేక అతని మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వాలని కోరుతోంది.19ఏళ్లు తన కుమారుడు పడుతున్న నరకాన్ని తాను చూడలేకపోతున్నానని వాపోయింది.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: అమ్మ ప్రేమ వెకట్టలేనిది.. ఇందుకు సాక్ష్యం కదలలేని, మెదల్లేని పరిస్థితిలో ఉన్న తన కొడుకును 24 ఏళ్లుగా కళ్లల్లో ఒత్తులు పెట్టుకొని సాకిన మాతృమూర్తి పెండ్యా తిరుమమ్మ. ఎల్కతుర్తి మండంలోని గోపాల్‌పూర్‌ గ్రామానికి చెందిన ఆ మాతృమూర్తి ఇప్పుడు అంటున్న మాటు వింటే చాలామంది విస్మయానికి గురవుతారు! కుమారుడు రజనీకాంత్‌కు వైద్యం చేయించే స్థోమత లేకపోవడం... వైద్య అందక తమ కొడుకు పడుతున్న ఇబ్బందును కళ్లారా చూడలేక తన గుండెను దిటవు చేసుకొని... కన్నీటి ధారలు ఆగకుండా ప్రవహిస్తుండగా ఆ అమ్మ ఓ మాట చెబుతోంది.. 'నా కొడుకుకు మెర్సీ కిల్లింగ్‌ను ప్రసాదించండి లేదా స్వచ్ఛంద సంస్థ సంరక్షణ కేంద్రంలో చేర్చండి' అని.

వివరాలు ఆమె మాటల్లోనే...
'నా పేరు పెండ్యా తిరుమ్మ. మా ఆయన పేరు సారయ్య మాకు నలుగురు కుమారులు. నిరుపేద కుంటుంబం మాది. రోజూ తెల్లవారుజామునే వరంగల్‌ మార్కెట్‌ నుంచి కూరగాయలు తెచ్చుకొని గోపాల్‌పూర్‌ పరిసర గ్రామాల్లో తిరిగి అమ్ముతుంటాం. ఇలా అమ్మగా వచ్చే అరకొర ఆదాయంతోనే మా ఇల్లు గడిచేది. మా రెండో కుమారుడు పెండ్యా రజనీకాంత్‌ను విధి వంచించింది. అతడు ఆరేళ్ల వయసులో ఉండగా ఫిట్స్‌ వచ్చి, కాళ్లు, చేతు చచ్చుబడ్డాయి'.

A Mother Pleads For Mercy Killing Of physically handicapped Son in Warangal

19 ఏళ్లుగా ఒకే గదిలో...
'రజనీకాంత్‌కు చికిత్స చేయించేందుకు మేం ఎన్నో అస్పత్రులు తిరిగాం. ఆర్థిక స్థోమతకు మించి, అప్పు చేసి మరీ రూ. 10లక్షల దాకా ఖర్చు చేశాం. అయినా మావాడి ఆరోగ్యం కొంచెం కూడా బాగుపడలేదు. ఇప్పటికీ ప్రతినెలా వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. కదలకుండా, మెదలకుండా 18 ఏళ్లపాటు ఒకే గదిలో మా కుమారుడు ఉన్నాడు. అతన్ని చూస్తూ నిత్యం కుమిలిపోయేవాళ్లం. అయినా మా బాబు ఎన్నటికైనా అందరిలా మామూలు మనిషి అవుతాడని ఏదో ఆశ ఉండేది. ప్రభుత్వం కరుణించి నా కుమారుడిని ఏదైనా స్వచ్ఛంద సంస్థకు చెందిన సంరక్షణ కేంద్రంలో చేర్పించాలి. మా లాంటి పేదలకు అండగా ఉండాలి. వైద్యం ఖర్చులన్నీ సర్కారే భరించాలి. లేదంటే మా అబ్బాయి మెర్సీకిల్లింగ్‌కు అనుమతించాలి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌,వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికాయి ఈ విషయంలో స్పందించాలి. దాతలు ముందుకొచ్చి మా అబ్బాయి వైద్యానికి చేతనైనంత సాయం చేయాలి'. అని ఆ తల్లి కోరింది.

English summary
A Mother Pleads For Mercy Killing Of physically handicapped Son In Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X