ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉపాధ్యాయుడి అవయవాలతో ముగ్గురికి జీవనదానం

వైరాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గంధం మల్లికార్జునరావు (54) బ్రెయిన్‌డెడ్‌ కావడంతో కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేశారు.

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: జిల్లాలోని వైరాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గంధం మల్లికార్జునరావు (54) బ్రెయిన్‌డెడ్‌ కావడంతో కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేశారు. ఫిబ్రవరి 17 తలపోటుతో స్పృహ కోల్పోయారు.

ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళగా అప్పటికే మొదడు నుంచి స్పందనలు లేకపోవడంతో వైద్యులు హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తీసుకెళ్ళాలని సూచించారు. అక్కడి వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు.

A teacher donates his organs to three people after brain death

గుండె కొట్టుకుంటుండటంతో రెండు మూత్రపిండాలు, కాలేయం ఇతరులకు అమర్చవచ్చని వైద్యులు చెప్పగా.. కుటుంబ సభ్యులు అంగీకరించి తెలంగాణ జీవన్‌దాన్‌కు సమాచారం అందించారు.

ఆదివారం ప్రత్యేక వైద్య నిపుణుల బృందం మల్లికార్జునరావు శరీరం నుంచి కిడ్నీలు, కాలేయం సేకరించి నగరంలోని వేరే ఆసుపత్రుల్లో అత్యవసరం ఉన్న వారికి వాటిని అమర్చారు. దీంతో ముగ్గురి ప్రాణాలు నిలిచాయి.

English summary
A teacher donates his organs to three people after brain death in Khammam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X