వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘గెటవుట్ ఆఫ్ మై కంట్రీ’: అమెరికాలో తెలుగు యువకుడి తలపై తుపాకీ పెట్టి బెదిరింపు

అమెరికాలో భారతీయులపై జరుగుతున్న వరుస దాడులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ తెలుగు యువకుడిని తుపాకీతో బెదిరింపులకు గురిచేసిన దుండగుడు..

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/హైదరాబాద్: అమెరికాలో భారతీయులపై జరుగుతున్న వరుస దాడులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ తెలుగు యువకుడిని తుపాకీతో బెదిరింపులకు గురిచేసిన దుండగుడు.. అతడు పనిచేసే సంస్థలో దోపిడీకి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆ యువకుడు తల్లితో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. కాగా, దోపిడీకి పాల్పడిన దుండగులు.. బెదిరింపులకు గురిచేసి వదిలేయడంతో వారిద్దరూ ఊపిరిపీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాకు చెందిన సామినేని భాస్కర్‌రావు సింగరేణిలోని శ్రీరాంపూర్‌ ఓపెన్ కాస్ట్‌లో మెకానికల్‌ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. ఆయన ఇద్దరు కుమారులు సాయి కిరణ్‌, సాయి వరుణ్‌లు ఉన్నత విద్య కోసం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లి మిసిసిపి రాష్ట్రం క్లింటన్‌ సిటీలో నివసిస్తున్నారు. సాయివరుణ్‌ ఎంఎస్‌ చదువుతూ స్థానిక షెల్‌ గ్యాస్‌ స్టేషన్‌లో పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు.

A thief threatens a Telugu youth in America

కాగా, అమెరికా కాలమాన ప్రకారం శనివారం రాత్రి 8గంటల సమయంలో గ్యాస్‌స్టేషన్‌ సంస్థలోకి నల్లరంగు ముసుగు దుస్తులు ధరించిన దుండగుడు చొరబడ్డాడు. ఆ సమయంలో వరుణ్‌.. శ్రీరాంపూర్‌లో ఉన్న తల్లి జయలక్ష్మితో వీడియోకాల్‌లో మాట్లాడుతున్నాడు. లోపలికి వచ్చిన దుండుగుడు తుపాకీతో బెదిరించి లాకర్లు తెరిచి డబ్బులన్నీ దోచుకున్నాడు.

ఈ క్రమంలో 'గెటవుట్‌ ఆఫ్‌ మై కంట్రీ'మా దేశాన్ని విడిచి వెళ్లిపో) అంటూ పలుమార్లు తుపాకీ తలపై పెట్టి బెదిరించాడని వరుణ్‌ చెప్పాడు. అప్పటికే వీడియోకాల్‌లో మాట్లాడుతున్న జయలక్ష్మి ఇదిచూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెద్ద కుమారుడు సాయికిరణ్‌కు ఫోన్‌ చేసి చెప్పడంతో అతను తమ్ముడి వద్దకు వెళ్లాడు. సీసీటీవీలో దోపిడీ దృశ్యాలను చూసి కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుడి కోసం గాలింపు చేపట్టారు.

కాగా, క్లింటన్‌ సిటీలో గత 14గేళ్లలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదని విన్నామని, భారతీయులతోపాటు ఇక్కడున్న ఇతర దేశాలవారు క్లింటన్‌ సిటీని చాలా భద్రమైనదిగా భావిస్తారని సాయికిరణ్‌ తెలిపాడు. ఇప్పుడు తన తమ్ముడిపై దాడితో వారంతా ఆందోళన చెందుతున్నారని తెలిపాడు. కాగా, భారతీయులపై వరుసగా జరుగుతున్న దాడులతో అమెరికాలో ఉన్న మనవారితోపాటు మనదేశంలోని వారి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే వెంటనే ఇంటికి వచ్చేయండని అమెరికాలోని వారిని కోరుతున్నారు.

English summary
A thief threatened a Telugu youth in America on Saturday night and he told that "Get out of my country".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X