హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అర్ధరాత్రి ఇంటికొస్తే ప్రియుడితో భార్య: నిలదీసినందుకు చంపేశారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే ఓ హతమార్చింది ఓ మహిళ. అంతేగాక, మద్యం తాగి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. ఈ దారుణ ఘటన నగరంలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

మద్యం వల్లేనని..

మద్యం వల్లేనని..

పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఆగస్టు 16న పహాడీషరీఫ్‌లో ఉండే మొహ్మద్‌ సలీం(35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తీవ్రంగా మద్యం తాగడం వల్లే చనిపోయాడని అతని బార్య షాహిన్‌బేగం అందరినీ నమ్మించింది.

పోలీసుల విచారణ

పోలీసుల విచారణ

చాంద్రాయణగుట్టలోని శ్మశానవాటికలో అంతక్రియలు జరిపేందుకు మృతదేహాన్ని తీసుకెళ్లారు. విషయం తెలియడంతో పహాడీషరీఫ్‌ పోలీసులు అంతక్రియలను అడ్డుకున్నారు. మృతదేహాన్ని పీఎమ్‌వీకి తరలించి మృతుని భార్య షాహిన్‌ను విచారించారు. తాడ్‌బన్‌ ప్రాంతానికి చెందిన సలీం.. రెండేళ్లక్రితం పహాడీషరీఫ్‌ వచ్చి ఉంటున్నాడు.

Recommended Video

Hyderabad Drugs Case : Puri Jagannadh interrogated for almost 10 hours by SIT
వివాహేతర సంబంధం వల్లే..

వివాహేతర సంబంధం వల్లే..

కాగా, షాహిన్‌కు యూసుఫ్‌ అనే యువకుడితో గత కొంతకాలం వివాహేతర సంబంధం ఉంది. తమకు సలీం అడ్డువస్తున్నాడని, అతన్ని అంతం చేయాలని షాహిన్‌ పథకం వేసింది.

నిలదీయడంతో హత్య

నిలదీయడంతో హత్య

వృత్తిరిత్యా లారీడ్రైవరైన సలీం ఆగస్టు 16న రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంట్లో షాహిన్‌తో యూసుఫ్‌ ఉండటంతో భార్యను నిలదీశాడు. యూసుఫ్‌తో గొడవపడ్డాడు.ఇదే అదనుగా భావించిన షాహిన్‌ ప్రియుడు యూసుఫ్‌తో కలిసి సలీంపై దాడి చేసి గొంతు నులిమి చంపేశారు. తీవ్రంగా తాగడం వల్లే తన భర్త చనిపోయాడని షాహిన్‌ అందరినీ నమ్మించింది. ఎట్టకేలకు పోలీసులు లోతుగా దర్యాప్తు జరపడంతో అసలు విషయం బయటపడింది. నిందితులు షాహిన్‌, యూసుఫ్‌లను సోమవారం రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.

English summary
A woman allegedly murdered his husband, with help of her lover in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X