వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తపై కోపంతో బావిలో దూకిన భార్య,సురక్షితంగా బయటపడిందిలా..

భార్య, భర్తల మద్య చిన్న గొడవ కారణంగా ఓ వివాహిత బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఆమెను రక్షించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది

By Narsimha
|
Google Oneindia TeluguNews

తాండూరు :భార్య, భర్తలు గొడవపడ్డారు. ఇద్దరి మద్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. మనస్థాపానికి గురైన భార్య బావిలో దూకి ఆత్మహత్యయత్నం చేసింది.అయితే స్థానికులు ఆమెను కాపాడారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఈ ఘటన తాండూరులో చోటుచేసుకొంది
చిన్న గొడవతో ఓ వివాహిత ప్రాణాల మీదకు తెచ్చుకొంది.అయితే స్థానికులు ఆమె ప్రాణాలను కాపాడారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించారు.

బావిలో దూకిన వెంటనే స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.ఆసుపత్రిలో ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

స్థానికులు వెంటనే స్పందించడంతో ప్రాణపాయం నుండి ఆమె తప్పించుకోగలిగింది. చిన్న విషయానికి ప్రాణాలు తీసుకోవాలని భావించడం సరైంది కాదంటున్నారు మానిసిక వైద్యులు.

ముంబాయి నుండి వచ్చిన రెండు రోజులకే గొడవ

ముంబాయి నుండి వచ్చిన రెండు రోజులకే గొడవ

తాండూరులోని దస్తగిరిపేట కు చెందిన బెడిగే జంగం మంజుల, ముల్కేష్ లు ముంబాయిలో కూలీ పనులుచేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు.వారికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ముంబాయి నుండే భార్య, భర్తలు ఆదివారం రాత్రి స్వగ్రామానికి తిరిగి వచ్చారు.సోమవారం నాడు ఉదయం మంజుల ఆత్మహత్యయత్నం చేసింది

చిన్న గొడవ కారణంగానే భార్య ఆత్మహత్యాయత్నం

చిన్న గొడవ కారణంగానే భార్య ఆత్మహత్యాయత్నం

ముంబాయి నుండే భార్య , భర్తలు స్వగ్రామానికి తిరిగి వచ్చారు.అయితే రాత్రి పూటే వారు గొడవపడ్డారు.అయితే ఈ గొడవతో మనస్థాపానికి గురైన మంజుల సోమవారం ఉదయం పూట మంజుల గ్రామ సమీపంలోని వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.

స్థానికుల స్పందనతో మంజులకు తప్పిన ప్రాణాపాయం

స్థానికుల స్పందనతో మంజులకు తప్పిన ప్రాణాపాయం

సోమవారం ఉదయం పూట మంజుల వ్యవసాయబావిలో దూకింది.వెంటనే స్థానికులు ఆమెను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఆమెను కాపాడాయి. ఆమె బావిలో దూకి విషయాన్ని గమనించిన స్థానికులు ,పోలీసులకు, ఫైరింజన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.దీంతో ఆమెను బావి నుండి వెంటనే బయటకు తీసేందుకు వీలైంది.బావిలో ఎక్కువగా నీరు లేకపోవడం వల్ల కూడ ఆమె ప్రాణాలకు ప్రమాదం తప్పిపోయింది.

బావిలో నుండి ఎలా రక్షించారంటే

బావిలో నుండి ఎలా రక్షించారంటే

బావిలో ఎక్కువగా నీరు లేకపోవడంతో అగ్నిమాపక కేంద్రం క్రేన్ కు మంచాన్ని బిగించారు. బావిలోకి దిగిన స్థానికులు మంజులను మంచంపై పడుకోబెట్టారు. క్రేన్ సహయంతో ఆమెను పైకి తీశారు. స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు.అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం ఆమెను స్థానికులే డబ్బులిచ్చి హైద్రాబాద్ కు పంపారు.

English summary
a woman sucide attempt in tandur, local people safely rescued her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X