వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సండ్రకు 14 రోజుల రిమాండ్, ఎమ్మెల్యే ఐనందున ప్రత్యేక ఖైదీగా

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏసీబీ అరెస్టు చేసిన సండ్ర వెంకట వీరయ్యకు న్యాయస్థానం 14 రోజుల రిమాండు విధించింది. ఈ నెల 21వ తేదీ వరకు అతనికి రిమాండ్ విధించింది. అనంతరం సండ్రను చర్లపల్లి జైలుకు తరలించారు. ఎమ్మెల్యే అయినందున ఆయనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని కోర్టు ఆదేశించింది.

మరోవైపు, సండ్ర వెంకట వీరయ్యను తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. దానిని న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది.

అంతకుముందు...

అనంతరం విచారణను న్యాయస్థానం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు వాయిదా వేసింది. అక్రమమా లేదా అన్న విషయాన్ని గంటలో చెబుతామని కోర్టు తెలిపింది.

ACB court adjourned trial on Sandra arrest

సండ్ర తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. అరెస్టు అక్రమమని చెప్పారు. సీఆర్పీసి 160 కింద తొలుత నోటీసులు ఇచ్చారని, ఆ తర్వాత 41ఏ సీఆర్పీసీ కింద ఇచ్చారని, అరెస్టు చేశారని చెప్పారు. సండ్ర అరెస్టును ఈసీ, సభాపతికి తెలియజేయలేదని చెప్పారు.

ఏసీబీ న్యాయవాది మాట్లాడుతూ.. కేసు కీలక దశలో ఉన్నప్పుడు సండ్ర రాజమండ్రి వెళ్లారని చెప్పారు. రాజమండ్రిలో ట్యాంపర్, హ్యాంపర్ చేశారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. సెబాస్టియన్‌కు సండ్ర ఫోన్ నుండి 22 కాల్స్ వెళ్లాయని ఏసీబీ చెప్పింది.

ACB court adjourned trial on Sandra arrest

కాగా, సండ్ర అరెస్టు పైన సభాపతి, ఈసీకి తెలియజేశారా అని న్యాయమూర్తి ఏసీబీ లాయర్‌ను ప్రశ్నించారు. సమాధానమిచ్చామని ఏసీబీ తెలిపింది. అందుకు సంబంధించి మెమో దాఖలు చేయాలని న్యాయస్థానం ఏసీబీకి సూచించింది. ఓటుకు నోటు కేసులో సండ్రను ఐదో నిందితుడిగా ఏసీబీ అధికారులు చేర్చారు.

English summary
ACB court adjourned trial on Sandra arrest
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X