వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతికి కేరాఫ్ సబ్ రిజిస్ట్రార్స్: కోట్లకు పడగలెత్తారు(పిక్చర్స్)

సబ్‌రిజిస్ట్రార్‌ తుమ్మల వెంకట్‌ రమేశ్‌చంద్రారెడ్డికి సంబంధించిన ఆస్తులపై ఏసీబీ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. గురువారం ఉదయం నుంచే ఎనిమిది ప్రాంతాల్లో మూకుమ్మడి దాడులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏసీబీ అధికారులు వరుసదాడులతో అవినీతి అధికారులకు హడలెత్తిస్తున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లపై సోదాలు చేస్తూ వారి అక్రమాస్తులను బయటపెడతున్నారు. ఇటీవల సబ్ రిజిస్ట్రార్లు శ్రీనివాసరావు, యూసుఫ్‌ల ఇళ్లలో దాడులు జరిపిన ఏసీబీ అధికారులు.. వందల కోట్ల అక్రమాస్తులను కూడగట్టినట్లు గుర్తించారు.

మరో కుంభకోణం: 40కోట్ల విలువైన భూమిని అక్రమంగా కట్టబెట్టారు, కోట్లలో రిజిస్ట్రార్ ఆస్తులుమరో కుంభకోణం: 40కోట్ల విలువైన భూమిని అక్రమంగా కట్టబెట్టారు, కోట్లలో రిజిస్ట్రార్ ఆస్తులు

తాజాగా, సస్పెన్షన్‌లో ఉన్న మేడ్చల్‌ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని సబ్‌రిజిస్ట్రార్‌ తుమ్మల వెంకట్‌ రమేశ్‌చంద్రారెడ్డికి సంబంధించిన ఆస్తులపై దాడులు చేశారు. అవినీతి నిరోధక శాఖ(అనిశా) డీఎస్పీలు అశోక్‌కుమార్‌, రవికుమార్‌, సునీతరెడ్డి, శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఎనిమిది బృందాలు గురువారం ఏకకాలంలో దాడులు నిర్వహించాయి.

2300ఎకరాలు కట్టబెట్టారు: సబ్‌రిజిస్ట్రార్ ఇంట్లో సోదాలు, 100కోట్లకుపైనే ఆస్తులు2300ఎకరాలు కట్టబెట్టారు: సబ్‌రిజిస్ట్రార్ ఇంట్లో సోదాలు, 100కోట్లకుపైనే ఆస్తులు

ఉదయం నుంచే సోదాలు

ఉదయం నుంచే సోదాలు

గురువారం ఉదయం ఆరు గంటల నుంచే నగరంలోని ఎనిమిది ప్రాంతాల్లో మూకుమ్మడి దాడులు నిర్వహించారు. నాగోలు కోఆపరేటివ్‌ బ్యాంకు కాలనీలోని రమేష్‌చంద్రారెడ్డి ఇంట్లో తనిఖీలు చేశారు. అతడి భార్య సునీత, తండ్రి జనార్దన్‌రెడ్డిలను ప్రశ్నించారు.

ఏకకాలంలో అన్ని ప్రాంతాల్లో..

ఏకకాలంలో అన్ని ప్రాంతాల్లో..

సునీత, జనార్ధన్ రెడ్డిల నుంచి సేకరించిన సమాచారంతో నాగోలు, మోహన్‌నగర్‌లలోని ఎస్‌బీఐ, న్యూనాగోలులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు, హస్తినాపురంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో లాకర్లలో దాచిన సొత్తును, పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉప్పల్‌లో అతడి బినామీగా భావిస్తున్న డాక్యుమెంట్‌ రైటర్‌ మేకల వెంకట్‌రెడ్డి ఇంటిపైనా దాడులు చేసి పత్రాల్ని సేకరించారు.

బినామీ ఆస్తులు..

బినామీ ఆస్తులు..

రమేష్‌చంద్రారెడ్డి కారు డ్రైవర్‌ పేరిట బ్యాంకులో బినామీ ఖాతా నిర్వహించినట్లు గుర్తించారు. కర్మన్‌ఘాట్‌, కోకాపేట, యాదాద్రి జిల్లా భువనగిరి మండలం రాయగిరిలోనూ దాడులు నిర్వహించారు.

రూ.10కోట్లపైనే ఆస్తులు..

రూ.10కోట్లపైనే ఆస్తులు..

ఈ క్రమంలో అతడితోపాటు కుటుంబ సభ్యులు, బినామీల పేరిటున్న సుమారు రూ.4 కోట్ల అక్రమాస్తుల్ని గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.10కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. అనిశా దాడులు కొనసాగుతాయని ఆ శాఖ డీఐజీ సత్యనారాయణ తెలిపారు.

రమేష్ చంద్రారెడ్డి అక్రమాస్తులు..

రమేష్ చంద్రారెడ్డి అక్రమాస్తులు..

బ్యాంకు ఖాతాల్లో నగదు రూ.1,07,76,000 , సు మారు నాలుగు కిలోల బంగారు ఆభరణాలు - రూ.70 లక్షలు(విలువ), ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాండ్లు - రూ.30 లక్షలు, భువనగిరి రాయగిరిలో 4.36 ఎకరాల స్థలం - రూ.32.78లక్షలు, భువనగిరి కేసారంలో 5.04 ఎకరాల స్థలం రూ.15.3లక్షలు గుర్తించారు.

అక్రమాస్తులు భారీగానే..

అక్రమాస్తులు భారీగానే..

రూ.46 లక్షలు విలువైన కర్మన్‌ఘాట్‌లో 300 చ.గ. ప్లాటు, నాగోలు, కొత్తపేటల్లో రెండు ఫ్లాట్లు - రూ.66.6 లక్షలు, స్విఫ్ట్‌ కారు - రూ.7 లక్షలు, ఇంటిలో నగదు - రూ.1.04 లక్షలు, గృహోపకరణాలు - రూ.7 లక్షలు, రెండు ద్విచక్ర వాహనాలు - రూ.1.2 లక్షలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

కొనసాగుతున్న దాడులు..

కొనసాగుతున్న దాడులు..

రమేష్‌చంద్రారెడ్డి నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి(పీఏపల్లి) మండలం అజ్మాపురం వాసి. అతని కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడినా ఇక్కడ వ్యవసాయ భూములున్నాయి. గురువారం అజ్మాపురంలోనూ ఏసీబీ అధికారులు స్థానిక రెవెన్యూ అధికారుల సమక్షంలో విచారణ చేపట్టారు. అతని భూములను సాగు చేస్తున్న రైతులు, గతంలోని కౌలుదారుల వాంగ్మూలాలు తీసుకున్నారు. ఇంకా అతని అక్రమాస్తులపై విచార

English summary
Continuing searches on accused involved in land registration fraud cases in Hyderabad for the third consecutive day, Anti-Corruption Bureau (ACB) detectives carried out simultaneous raids on properties and offices related to Medchal sub-registrar T V Ramesh Chander Reddy and unearthed disproportionate assets worth 3.65 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X