హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తవ్వే కొద్దీ రూ. కోట్లలో అక్రమాస్తులు: ఏసిపి సంజీవరావు ఇంట్లో ఏసిబి సోదాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు కూకట్‌పల్లీ ఏసీపీ సంజీవరావు ఇంటిపై దాడులు నిర్వహించారు. కూకట్‌పల్లిలోని ఏసీపీ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు కోట్ల రూపాయలు ఆస్తులు గుర్తించారు.

ఏసీపీ స్వస్థలం రేగొండ మండలం దమ్మన్నపేటలోనూ ఏసీబీ దాడులు చేసింది. వరంగల్‌లో ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. అల్వాల్‌లో ఉన్న మరో ఇంటిలోనూ తనిఖీలు చేశారు. హన్మకొండలోని అడ్వకేట్ కాలనీలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ సునీత ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

ఏసిపి ఇళ్లు, కార్యాలయంలోపాటు 6చోట్ల సోదాలు నిర్వహించారు ఏసిబి అధికారులు. వరంగల్ అల్వాల్, శామిర్ పేట, దమ్మన్నపేటల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. రూ. 5కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్లు గుర్తించారు. మరిన్ని ఆస్తులు కూడా ఉన్నట్లు గుర్తించి సోదాలు విస్తృతం చేశారు ఏసిబి అధికారులు. కాగా, ఏసిపి అధికారి ప్రముఖ టిడిపి నేత బంధువుగా తెలుస్తోంది.

ACB searches in ACP Sanjiva Rao's houses

ఇది ఇలా ఉండగా, ఏసిపి ఇళ్లల్లో సోదాలు చేస్తున్న అధికారులకు అనేక కోట్ల రూపాయల ఆస్తులు తవ్వేకొద్దీ బయటికొస్తున్నాయి. ఏసిపి అధికారి బినామీ పేర్లతో ఆస్తులను కలిగి ఉన్నట్లు గుర్తించిన ఏసిబి అధికారులు.. వారి వారి ఇళ్లల్లో కూడా సోదాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఏసిపి సంజీవరావు ఉంటున్న ఇల్లు మూడంతస్తుల్లో ఇంద్రభవనంలా ఉంది. అంతేగాక, ములుగులో 30ఎకరాల తోట, తమ్మన్నపేటలో 5ఎకరాల భూమి ఉన్నట్లు ఏసిబి అధికారులు గుర్తించారు. అల్వాల్‌లో ఓ షాపింగ్ మాల్, రెండంతస్తుల భవనం ఉన్నట్లు గుర్తించారు. వరంగల్‌లో కూడా ఓ ఖరీదైన భవనం ఏసిపికి ఉన్నట్లు తేల్చారు. వరంగల్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన నాటి నుంచి సంజీవరావు అక్రమాస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. అక్బర్ అనే ఓ పోలీసు సంజీవరావుకు బినామీగా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.

ACB searches in ACP Sanjiva Rao's houses

కోర్టు అనుమతితో సోదాలు

ఏసిపి స్వగ్రామమైన దమ్మన్నపేటతోపాటు అతనికున్న అన్ని ఇళ్లల్లోనూ కోర్టు అనుమతితో సోదాలు నిర్వహించడం జరుగుతోందని ఏసిబి అధికారి సునీత తెలిపారు. 75తులాల బంగారం, రూ. 3లక్షల నగదు లభించాయని చెప్పారు. మెదక్ జిల్లాలో 45 ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సంజీవరావుకు బినామీలు కూడా ఉన్నారని తెలిపారు. పూర్తి విచారణ తర్వాత అన్ని విషయాలు వెల్లడవుతాయని సునీత తెలిపారు. రూ. 2కోట్లకు మించి ఆస్తులుంటాయని, ఇప్పుడే ఏమి చెప్పలేమని తెలిపారు. సోమవారం నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.

English summary
ACB officials on Saturday moring searched in Kukatpally ACP Sanjiva Rao's houses in Hyderabad and various places.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X