హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: 2014 తర్వాత ఆ డిగ్రీలు చెల్లవు, ఎందుకంటే?

తెలుగు, ఉర్ధూ , హిందీ పండిత శిక్షణ కోర్సులకు సంబంధించిన డిగ్రీలు పనికిరావని కేంద్రం తేల్చిచెప్పింది. 2014 తర్వాత ఈ కోర్సులేవి కూడ చెల్లుబాటు కావని కేంద్రం ప్రకటించింది.అయితే 2014కు ముందు కూడ ఎన్ సీ టీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు, ఉర్ధూ , హిందీ పండిత శిక్షణ కోర్సులకు సంబంధించిన డిగ్రీలు పనికిరావని కేంద్రం తేల్చిచెప్పింది. 2014 తర్వాత ఈ కోర్సులేవి కూడ చెల్లుబాటు కావని కేంద్రం ప్రకటించింది.అయితే 2014కు ముందు కూడ ఎన్ సీ టీ ఈ గుర్తింపు ఉంటేనే ఈ కోర్సులకు విలువ ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

ఉపాధ్యాయ పోస్టుల ఎంపిక విషయంలో హిందీ, ఉర్దూ, తెలుగు పండిత శిక్షణ కోర్సులు పూర్తి చేసుకొన్న వారు కూడ అర్హులుగా పరిగణిస్తున్నారు. ఈ కోర్సులను ఆధారంగా చేసుకొని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

అయితే ఈ కోర్సులు పనికిరావంటూ కేంద్రం తేల్చిచెప్పేసింది.ఈ కోర్సుల విషయమై కేంద్రం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.ఈ నిభందనలను పాటిస్తూ ఈ డిగ్రీ కోర్సులు పూర్తి చేసినవారికి టీచర్ పోస్టులకు అర్హులగా మారుతారు.

టీచర్ పోస్టుల భర్తీ చేయాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం తెప్పించింది. అయితే 129 రకాల డిగ్రీలే చెల్లుబాటు అవుతాయని కేంద్ర మార్గదర్శకాల ప్రకారం తేలింది. 16 డిగ్రీలు చెల్లవని కేంద్రం స్పష్టం చేసింది.కేంద్రం సూచించినట్టుగానే రాష్ట్రం వ్యవహారించనుంది.

లాంగ్వేజ్ పండిత్ డిగ్రీలకు షరతులు వర్తిస్తాయి

లాంగ్వేజ్ పండిత్ డిగ్రీలకు షరతులు వర్తిస్తాయి

తెలుగు, ఉర్ధూ, హిందీ పండిత శిక్షణ కోర్సులకు షరతులు వర్తించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.ఈ మేరకు 2014 జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్ సీ టీ ఈ) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారంగా 2014 తర్వాత ఈ పండిత కోర్సులతో డిగ్రీలు చెల్లవని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణలో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు ధరఖాస్తు చేసుకొనేందుకుగాను ఆ కోర్సులు పనికిరావని కేంద్ర నిబంధనలు చెబుతున్నాయి.ఈ నిబంధనల ప్రకారమే రాష్ట్ర కూడ నడుచుకోనుంది.2014 కు మందు కూడ ఈ కోర్సుతో డిగ్రీ చేసిన వారికి కూడ కొన్ని షరతులు వర్తిస్తాయి.ఈ షరతుల ప్రకారంగా డిగ్రీ చేస్తేనే ఆ డిగ్రీలు చెల్లుబాటు అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది.2014 కు ముందు ఈ కోర్సులు చేసినవారు ఎన్ సీ టీ ఈ గుర్తింపు ఉంటేనే ఈ డిగ్రీలు చెల్లుబాటు అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది.

16 రకాల కోర్సులు కూడ చెల్లుబాటు కావు

16 రకాల కోర్సులు కూడ చెల్లుబాటు కావు

డిగ్రీతో తత్సమానంగా పేర్కొంటున్న మరో 16 రకాల కోర్సులు కూడ చెల్లుబాటు కావు. ఈ కోర్సులను కూడ 2014 కు ముందు చేసి అప్పట్లో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసి) గుర్తింపు ఇచ్చిన డిగ్రీల జాబితాలో ఉంటే మాత్రమే ప్రస్తుతం ఉద్యోగ ధరఖాస్తులకు చెల్లుబాటు అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది.2014 తర్వాత దేశ వ్యాప్తంగా డిగ్రీలన్నీ ఒకే రకంగా ఉండాలని అప్పట్లోనే యూజీసి స్పష్టం చేసింది. మొత్తంగా 129 రకాల డిగ్రీలు మాత్రమే ఉండాలని ఈ మేరకు అవసరమైన మార్పులు చేసుకోవాలని విద్యాసంస్థలను ఆదేశించింది.

యూనివర్శిటీలకే తెలియని డిగ్రీలు

యూనివర్శిటీలకే తెలియని డిగ్రీలు

వివిధ యూనివర్శిటీలకే యూజీసి మార్గదర్శకాలు, డిగ్రీల విషయంలో స్పష్టమైన అవగాహానలేదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. పాత పేర్లతోనే డిగ్రీలు ప్రదానం చేస్తున్నాయన్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వెళ్లే విధ్యార్థులు సమస్యలు ఎదుర్కోవాల్సివస్తోందన్నారు. 2014 నుండి ఒకేరకమైన డిగ్రీలు ఉండాలన్న మార్గదర్శకాలకు అనుగుణంగా డిగ్రీల పేర్లను మార్చాల్సిన అవసరం ఉంది.

టీఎస్ పి ఎస్ సి చొరవతో వెలుగులోకి

టీఎస్ పి ఎస్ సి చొరవతో వెలుగులోకి

గురుకుల, టీచర్ పోస్టుల భర్తీకి ధరఖాస్తును స్వీకరిస్తోంది. అభ్యర్థులు కొత్త కొత్త పేర్లతో డిగ్రీ తత్సమాన సర్టిఫికెట్లు అంటూ ధరఖాస్తులు చేసుకొన్నారు. అయితే ఇవి సరైన డిగ్రీలా కాదా అనే అనుమానం తలెత్తింది.2014 జూలై 11న, దేశవ్యాప్తంగా ఒకే రకమైన డిగ్రీలు ఉండాలని కేంద్రం ప్రకటించింది. ఆ నోటిఫికేషన్ వెబ్ సైట్ లో కొందరు అభ్యర్థులు ధరఖాస్తు చేసిన డిగ్రీలు అందుబాటులో లేకపోవడంతో సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలోనే ఎస్ సీ ఈఆర్ టీ నుండి స్పష్టత తీసుకురావాలని అభ్యర్థులకు టీఎస్ పి ఎస్ సి స్పష్టం చేసింది.

English summary
After 2014 language pandit degree courses not valid said union governament.16 degree courses not valid said union governament. union governament approval courses valid for teacher recruitement TSPSC said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X