వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో తెలుగు టెక్కీ మృతి: 'బొట్టు పెట్టుకోవడం ద్వారా రక్షించుకోండి'

ప్రపంచవ్యాప్తంగా నివసించే హిందూ మహిళలు తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలని, హిందూ పురుషులు తమ నుదుటన తిలకం దిద్దుకోవాలని హిందూ సంహతి అధ్యక్షులు తపన్ ఘోష్ అన్నారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా నివసించే హిందూ మహిళలు తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలని, హిందూ పురుషులు తమ నుదుటన తిలకం దిద్దుకోవాలని హిందూ సంహతి అధ్యక్షులు తపన్ ఘోష్ అన్నారు.

కన్సాస్ కాల్పుల ఘటనలు వంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇదే సరైన చర్య అన్నారు. ముస్లీం ఉగ్రవాదాన్ని దృష్టిలో ఉంచుకొని హిందువులు నుదుటిన తిలకం, బొట్టు పెట్టుకోవడం ద్వారా తమను తాము రక్షించుకోవచ్చన్నారు.

<strong>టెక్కీ మృతిపై దత్తాత్రేయ, కేంద్రానికి కేటీఆర్: 'ట్రంప్! ఈ శోకం ఎవరికీ వద్దు'</strong>టెక్కీ మృతిపై దత్తాత్రేయ, కేంద్రానికి కేటీఆర్: 'ట్రంప్! ఈ శోకం ఎవరికీ వద్దు'

After Kansas shooting, this neta advised Hindus to wear 'tilak' for security

శ్రీనివాస్‌, ఆయన మిత్రుడిని పశ్చిమ ఆసియా దేశాలకు చెందినవారిగా భావించి కాల్పుల జరిపానని నిందితుడు వెల్లడించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందువులు తమ మతం తెలిసేలా ఈ చిహ్నాలు పాటించాలని తపన్‌ సూచించారు.

పరిస్థితుల దృష్ట్యా భద్రత కోసం ఈ సూచన చేస్తున్నానని తెలిపారు. ఇతర మతాల చిహ్నాలు ధరించడం ద్వారా తమను తాము దాడుల నుంచి కాపాడుకోవాలని ముస్లింలకు ఇస్లాం మత పెద్దలు సూచించాలని కూడా తపన్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

English summary
Days after an Indian techie was killed in an alleged hate crime in Kansas, US, Hindu Samhati president Tapan Ghosh courted controversy by suggesting that Hindu men should show their identity by wearig 'tilak' while Hindu women should wear 'bindi' on their foreheads for their security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X