వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంబులెన్స్ లేదని మొండిగా ఆపరేషన్ చేసిన నర్స్, గర్భిణీ మృతి

డాక్టర్లు లేకపోవడంతో నర్స్ శస్త్రచికిత్స చేయడంతో ఓ గర్భిణి మరణించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కామారెడ్డి :ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో ఓ నర్స్ సిజేరియన్ ఆపరేషన్ చేసింది. అయితే ఆమె చేసిన ఆపరేషన్ ఫెయిల్ కావడంతో గర్భిణీ మరణించింది.ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకొంది.

కామారెడ్డి జిల్లాలో ఓ గర్భిణీకి విధుల్లో ఉన్న నర్స్ ఆపరేషన్ చేసింది. ఈ ఆపరేషన్ వికటించింది, గర్భిణి మరణించింది. ఈ ఘటన తో గర్భిణి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

operation

కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరుకు చెందిన కోనింటి భాగ్య ప్రసవం కోసం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వచ్చింది.అయితే సమయానికి ఆసుపత్రిలో వైద్యులు లేరు. భాగ్య కుటుంబసభ్యులు ఆమెను కామారెడ్డి ఆసుపత్రికి పంపాలని కోరారు.

అయినా ఆ నర్స్ వినిపించుకోలేదు. గర్భిణీకి తానే ఆపరేషన్ చేసి కాన్పు చేసింది. సిజేరియన్ చేసిన వెంటనే భాగ్య మరణించింది. దీంతో ఆసుపత్రి ఎదుట భాగ్య కుటుంబ సబ్యులు ఆందోళనకు దిగారు. అంబులెన్స్ లేదని నర్స్ కామారెడ్డికి తరలించకుండా భిక్కనూర్ లోనే ఆపరేషన్ చేసింది. దీంతో గర్భిణి మరణించింది.

English summary
after surgery a pregnant lady die in kamareddy district , bhagya joined in bikkanoor phc for delivery, a nurse done surgery bhagya, after surgery she died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X