వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీపై బీజేపీ ప్లాన్, గ్రేటర్ ఎన్నికలకు ముందే మోడీతో..

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆదివారం పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ శాసన సభా పక్ష నేత లక్ష్మణ్ మరికొందరు నాయకులతో సమావేశమై తెలంగాణలో బీజేపీని పటిష్ఠం చేయటంతో పాటు విస్తరించటం గురించి లోతుగా చర్చలు జరిపారు. అమిత్ షాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన ఎన్ రామచంద్ర రావు కలిశారు.

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రామచంద్ర రావు ఘన విజయం సాధించటం, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీని ప్రజల వద్దకు తీసుకుపోయేందుకు తాము చేస్తున్న కృషి గురించి కిషన్ రెడ్డి వివరించారు. కష్టపడి పని చేయటంతో పాటు ప్రజల తరపున పోరాడితే తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఎదిగేందుకు అన్ని అవకాశాలున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్ పెద్దగా పుంజుకోవటం లేదని, టీడీపీ పుంజుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే తెరాసకు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదగవచ్చునని తెలంగాణ నేతలు సూచించారని సమాచారం. తెలంగాణలో బీజేపీని ప్రజల వద్దకు తీసుకుపోయేందుకు అనుసరించవలసిన విధానంపై బండారు దత్తాత్రేయ కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు.

బీజేపీ

బీజేపీ

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, ఆ గెలుపును స్ఫూర్తిగా తీసుకొని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోను విజయం సాధిస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 బీజేపీ

బీజేపీ

2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు బాగా పని చేశాయని అమిత్ షా వారిని అభినందించారు.

 బీజేపీ

బీజేపీ

గ్రామ గ్రామానికి కమలం కార్యక్రమం చేపట్టి మారుమూల గ్రామాలకు కూడా పార్టీని విస్తరింప చేయాలని అమిత్ షా నేతలకు సూచించారు.

 బీజేపీ

బీజేపీ

త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత సనత్ నగర్ ఉప ఎన్నికలు, అనంతరం వరంగల్ లోకసభ, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికలు రానున్నాయని బీజేపీ బలోపేతానికి ఇదే సమయమని నేతలు అమిత్ షాకు చెప్పారు.

 బీజేపీ

బీజేపీ

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తుల గురించి అమిత్ షాతో తాము చర్చించలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్డీయేలో తెరాస చేరుతుందనడం వాస్తవ విరుద్దమన్నారు.

 బీజేపీ

బీజేపీ

తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర నేతల సూచనలు, సలహాలకు అమిత్ షా అంగీకరించారు. అంతేకాకుండా, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే ప్రధాని నరేంద్ర మోడీతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని బీజేపీ యోచిస్తోంది.

 బీజేపీ

బీజేపీ

తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కేంద్రమంత్రులు తెలంగాణలో పర్యటిస్తారని, ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటారని అమిత్ షా వారికి చెప్పారని తెలుస్తోంది.

 బీజేపీ

బీజేపీ

కేంద్రమంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న, ప్రజలకు చేస్తున్న పథకాల గురించి చెబుతారని చెప్పారని తెలుస్తోంది.

 బీజేపీ

బీజేపీ

పలు ఎన్నికల దృష్ట్యా తెలంగాణ ప్రాంత నేతలు ఏప్రిల్ నెలలో గ్రామ గ్రామానికి వెళ్లాలని, అక్కడే బస చేయాలని అమిత్ షా సూచించారు.

English summary
BJP national president Amit Shah on Sunday approved the road map for strengthening the party in Telangana for the 2019 elections and assured to arrange a programme by Prime Minister Narendra Modi in the state before the GHMC polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X