విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండోసారి చీఫ్‌గా షా, మొహం చాటేసిన అద్వానీ: తెలంగాణలో సంబరం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/విజయవాడ/హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షులుగా అమిత్ షా (51) మరోసారి ఎన్నికయ్యారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, నితిన్‌ గడ్కరీ, బిజెపి ముఖ్యమంత్రులు తదితరులు ఆయన పేరును ప్రతిపాదించారు.

మొత్తం 17 నామినేషన్లు ఆయన పేరిట దాఖలయ్యాయి. మూడుగంటల నిర్ణీత గడువు ముగిసేలోగా మరెవరూ పోటీ చేయడానికి ముందుకు రాకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయినట్లు పార్టీ ఎన్నికల అధికారి అవినాశ్‌రాయ్‌ ఖన్నా ప్రకటించారు.

మూడేళ్ల పాటు షా ఆ పదవిలో కొనసాగుతారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు బిజెపి కేంద్ర, రాష్ట్ర స్థాయి అగ్రనేతలంతా హాజరు కాగా గతంలో అమిత్ షా నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తపరిచిన అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి వంటి కొంతమంది నేతలు మాత్రం మొహం చాటేశారు.

అమిత్ షా

అమిత్ షా

అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో ప్రధాని మోడీ స్వయంగా దీనికి రాలేకపోయారు. ఈ నెల 28న జరగడానికి అవకాశం ఉన్న బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అమిత్ షాకు లాంఛనప్రాయంగా మోడీ స్వాగతం పలకనున్నారు.

అమిత్ షా

అమిత్ షా

కాగా, అమిత్ షా.. అద్వానీ ఆశీస్సులు తీసుకున్నారు. మరో రెండు రోజుల్లో మురళీ మనోహర్ జోషి ఆశీర్వాదం తీసుకోనున్నారని తెలుస్తోంది.

అమిత్ షా

అమిత్ షా

బిజెపి జాతీయ అధ్యక్షులుగా అమిత్ షా (51) మరోసారి ఎన్నికయ్యారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, నితిన్‌ గడ్కరీ, బిజెపి ముఖ్యమంత్రులు తదితరులు ఆయన పేరును ప్రతిపాదించారు.

తెలంగాణలో సంబరాలు

తెలంగాణలో సంబరాలు

బిజెపి జాతీయ అధ్యక్షులుగా అమిత్ షా రెండోసారి ఎన్నిక కావడంతో తెలంగాణలో ఆ పార్టీలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాణాసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

తెలంగాణలో సంబరాలు

తెలంగాణలో సంబరాలు

మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... అమిత్ షా నాయకత్వంలో 2019లో మరోసారి బిజెపి కేంద్రంలో అధికారంలోకి రావడం తధ్యమన్నారు.

తెలంగాణలో సంబరాలు

తెలంగాణలో సంబరాలు

బిజెపి జాతీయ అధ్యక్షుడిగా మరోమారు అమిత్ షాను ఎంపికచేయడంపై తెలంగాణతో పాటు ఏపీ బిజెపి నాయకులు కూడా ఆదివారం హర్షం వ్యక్తంచేశారు.

తెలంగాణలో సంబరాలు

తెలంగాణలో సంబరాలు

అమిత్ షా నాయకత్వంలో దేశంలో అనేక రాష్ట్రాల్లో పార్టీ తిరుగులేని విజయం సాధించిందని, కాంగ్రెస్‌ పార్టీకి పునాదులు కదిలాయని బిజెపి నేతలు చెబుతున్నారు.

తెలంగాణలో సంబరాలు

తెలంగాణలో సంబరాలు

రానున్న రోజుల్లో అమిత్ షా నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలు సాధిస్తుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

English summary
Amit Shah on Sunday got a second consecutive term as BJP president, in a development which was widely expected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X