వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీకు బీపీ పెరుగుతోంది, మళ్లీ చెప్తున్నా.. అమెరికాని వెనక్కి నెట్టాం: కేసీఆర్‌కు షా

తాము ఎవరినో భయపెట్టేందుకు ఇక్కడకు రాలేదని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా బుధవారం అన్నారు. ప్రత్యర్థులకు బీపీ పెరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాము ఎవరినో భయపెట్టేందుకు ఇక్కడకు రాలేదని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా బుధవారం అన్నారు. ప్రత్యర్థులకు బీపీ పెరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

'కేసీఆర్‌! ఉద్యమంలో నువ్వెక్కడ?'

తాను వెళ్లేలోపు కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెప్పమంటున్నారని ఎద్దేవా చేశారు. నన్ను క్షమాపణ చెప్పమన్నారన్నారు. మోడీ సర్కార్ వచ్చాక తెలంగాణకు సాయం పదింతలు పెరిగిందన్నారు.

కచ్చితంగా.. లక్ష కోట్లు ఇచ్చాం

కచ్చితంగా.. లక్ష కోట్లు ఇచ్చాం

తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామన్న మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఏమేం ఇచ్చామో అమిత్ షా వరుసగా చెప్పారు. నిన్న చెప్పిందే చెబుతున్నానని, లక్ష కోట్లు ఇచ్చామన్నారు.

వివిధ పథకాలకు రూ.12వేల కోట్లు ఇచ్చామని చెప్పారు. జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, హార్టికల్చరల్ యూనివర్సిటీ ఇచ్చామని చెప్పారు. ఇది తెలంగాణ ప్రజల హక్కు అన్నారు. కానీ సాయం గతంలో కంటే పెంచామన్నారు.

కేసీఆర్ వ్యాఖ్యలపై..

కేసీఆర్ వ్యాఖ్యలపై..

అంతకుముందు కేసీఆర్ విలేకరుల సమావేశంలో బీజేపీపై, అమిత్ షాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా మాట్లాడారు. తెలంగాణకు ఏం చేశామో ఇంటింటికి వెళ్లి కార్యకర్తలు చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే అన్నారు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అన్నారు.

1327 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు

1327 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు

ఒకప్పుడు బీజేపీ ఎంపీలను భూతద్దంలో చూసేవారన్నారు. ఇప్పడు ప్రధాని నరేంద్ర మో హయాంలో దేశం దూసుకుపోతోందన్నారు. 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, 1327 మంది ఎమ్మెల్యేలు దేశవ్యాప్తంగా ఉన్నారని చెప్పారు.

మోడీ నేతృత్వంలోనే బీజేపీ అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు. మోడీ మూడేళ్ల పాలనను ఇంటింటికి తీసుకు వెళ్తామన్నారు. పార్టీ సిద్ధాంతాల కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు.

అమెరికాను వెనక్కి నెట్టాం

అమెరికాను వెనక్కి నెట్టాం

ఒకేసారి 104 ఉపగ్రహాలు పంపించి అగ్రదేశం అమెరికాను కూడా వెనక్కి నెట్టామని అమిత్ షా అన్నారు. జన్ ధన్ పథకం కింద 28 కోట్ల బ్యాంకు అకౌంట్లు తెరిచామని చెప్పారు. 70 ఏళ్లలో సాధ్యం కానివి ఎన్నో మూడేళ్లలో చేసి చూపించామన్నారు.

పాక్‌కు బుద్ధి చెప్పాం

పాక్‌కు బుద్ధి చెప్పాం

సర్జికల్ స్ట్రయిక్స్‌తో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పింది బీజేపీ ప్రభుత్వం అమిత్ షా అన్నారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేస్తామని చెప్పారు. ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించామన్నారు. మోడీ హయాంలో ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందన్నారు.

కాంగ్రెస్ హయాంలో బ్యాంకులను జాతీయం చేసారని, కానీ పేదలకు మాత్రం మూసేశారనని చెప్పారు. తాము జన్ ధన్ యోజన తీసుకు వచ్చామన్నారు. మోడీ నేతృత్వంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందన్నారు.

English summary
BJP National President Amit Shah gave counter to Telangana CM K Chandrasekhar Rao for blaming him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X