హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టార్గెట్: యూపి ఫార్మూలా అమలు, అమిత్ షా వ్యూహమిదే, కెసిఆర్ కు చెక్?

ఉత్తర భారత దేశంలో దాదాపుగా పట్టుసాధించిన బిజెపి దక్షిణ భారత దేశంలో పట్టుకోసం ప్రయత్నాలను ప్రారంభించింది.దక్షిణాదిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ పట్టు సాధించేందుకుగాను పావులు కదుపుతోంది.ఏప్రి

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైద్రాబాద్: ఉత్తర భారత దేశంలో దాదాపుగా పట్టుసాధించిన బిజెపి దక్షిణ భారత దేశంలో పట్టుకోసం ప్రయత్నాలను ప్రారంభించింది.దక్షిణాదిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ పట్టు సాధించేందుకుగాను పావులు కదుపుతోంది.ఏప్రిల్ 7వ, తేదిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఉద్దేశ్యం కూడ పార్టీ బలోపేతం చేయడమే ప్రధాన ఉద్దేశ్యం.

దక్షిణ భారతంలో కర్ణాటక రాష్ట్రంలో మినహా ఆ పార్టీకి పెద్దగా పట్టులేదు. దీంతో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రంపై కేంద్రీకరించింది.ఎపి కంటే తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్ ఉంటుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది.

తెలంగాణలో పార్టీ బలోపేతమయ్యే అవకాశాలున్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయినట్టుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయపడుతున్నాడు.

ఒడిశా రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బిజెడికి చుక్కలు చూపించింది బిజెపి. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకొని ఆ పార్టీ పావులు కదుపుతోంది.

 తెలంగాణలో పార్టీ విస్తరణే లక్ష్యంగా అమిత్ షా ప్లాన్

తెలంగాణలో పార్టీ విస్తరణే లక్ష్యంగా అమిత్ షా ప్లాన్

తెలంగాణలో పార్టీ పునాదులను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.ఈ మేరకు అమిత్ షా తెలంగాణపై ప్రత్యేక శ్రద్ద తీసుకొంటున్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా బిజెపి ఈ ప్లాన్ ను చేస్తోంది. ఈ మేరకు గ్రౌండ్ వర్క్ చేస్తోంది బిజెపి.ఈ మేరకు ఏప్రిల్ 7వ, తేదిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైద్రాబాద్ లో పర్యటించనున్నారు.

ఆర్ఎస్ఎస్ ప్లాన్ కు అమిత్ షా వ్యూహం

ఆర్ఎస్ఎస్ ప్లాన్ కు అమిత్ షా వ్యూహం

తెలంగాణలో పార్టీని పటిష్టం చేసే ప్రక్రియలో భాగంగా ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేస్తోంది.దీనికి అమిత్ షా వ్యూహలు కూడ తోడైతే బిజెపి పట్టు సాధిస్తోందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఇదే తరహ ప్లాన్లను ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసి ఆ పార్టీ ఘన విజయం సాధించింది.

బూత్ స్థాయి నుండి పార్టీని పటిష్టం చేయడం

బూత్ స్థాయి నుండి పార్టీని పటిష్టం చేయడం


బూత్ స్థాయి నుండి పార్టీని పటిష్టం చేసే లక్ష్యంతో బిజెపి వ్యూహరచన చేస్తోంది.నిద్రాణంగా ఉన్న పార్టీ అభిమానులను మేల్కోల్పడంతో పాటు జాతీయవాదులను తమ వైపుకు తిప్పుకోవడం లక్ష్యంగా వివిధ స్థాయిల్లో నాయకత్వాన్ని సమాయత్తం చేస్తోంది.యూపిలో కూడ బూత్ స్థాయి నుండి పార్టీని పటిష్టం చేసుకొంటూ వచ్చింది బిజెపి.ఏప్రిల్ 7వ, తేదిన బూత్ స్థాయి పార్టీ కార్యకర్తలతో అమిత్ షా సమావేశం కానున్నారు.

అంబేద్కర్ జయంతి రోజున సభలు

అంబేద్కర్ జయంతి రోజున సభలు


ఏప్రిల్ 14వ, తేదిన అంబేద్కర్ జయంతి రోజున తెలంగాణలోని ఏడు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో సభలను నిర్వహిస్తోంది బిజెపి.ఈ నెల 7వ, తేదిన హైద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటారు.ఏప్రిల్ 8న, భువనగిరిలో జరిగే సభలో కేంద్ర మంత్రి జవదేకర్, నిజామాబాద్ సభకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొంటారు. మహబూబ్ నగర్ సభకు అనంత కుమార్, కరీంనగర్ సభకు పురుషోత్తం , వరంగల్ సభకు కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ , మెదక్ సభకు హరిబాబు, మల్కాజిగిరి సభకు మురళీధర్ రావు పాల్గొంటారు.

గండిపేట మీటింగ్

గండిపేట మీటింగ్


సంఘ్ పర్యవేక్షణలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే వ్యూహరచన సాగుతోంది.ఈ మేరకు గండిపేటలో బిజెపి రహస్య సమావేశాన్ని నిర్వహించిందని తెలుస్తోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ఈ విషయమై కూడ అమిత్ షాతో పార్టీ నాయకులు చర్చించే అవకాశం ఉంది.

యూపి ఫార్మూలా వర్కవుట్ అవుతోందా?

యూపి ఫార్మూలా వర్కవుట్ అవుతోందా?

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అనుసరించిన ఫార్మూలా తెలంగాణ రాష్ట్రంలో వర్కవుట్ అవుతోందా అనే చర్చ కూడ లేకపోలేదు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకే ఆ పార్టీ పరిమితమైంది.అయితే పార్టీ బలోపేతం అయ్యేందుకు ఉన్న అవకాశాలను కూడ పార్టీ తెలంగాణ నాయకత్వం సక్రమంగా ఉపయోగించుకోలేకపోయిందనేది జాతీయ నాయకత్వం భావన. ఈ తరుణంలో ప్రధానంగా హైద్రాబాద్ పార్లమెంట్ స్థానంపై ఆ పార్టీ కేంద్రీకరించి పనిచేస్తోంది.

English summary
Bjp national president Amit Shah will be reaching Hyderabad on April 7 to hold meetings with over 14000 booth level workers in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X