వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిటెక్ విద్యార్థిని ఝాన్సీ కేసులో మరో ట్విస్ట్: భర్తతో తల్లికి అక్రమసంబంధం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలో మరణించిన బిటెక్ విద్యార్థిని మృతి కేసు మరో మలుపు తిరిగింది. అనూహ్యమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వారం రోజుల క్రితం ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, గుట్టు చప్పుడు కాకుండా కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు జరిపించారు.

అయితే, ఆ తర్వాత వివాదం ముందుకు వచ్చి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 'నా చావుకు కారణాలివీ' అంటూ ఆ యువతి రాసిన లేఖ పోలీసులకు అందింది. దీంతో ఝాన్సీ ఆత్మహత్య వివాదం కొత్త మలుపు తిరిగింది. హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్న గుర్రపు ఝాన్సీరాణి (21) తన మరణానికి గల కారణాలను ఆ లేఖలో వివరించింది. ఆ లేఖలో ఝాన్సీరాణి చేసిన సంచలన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నట్లు మంగళవారం మీడియాలో వార్తలు వచ్చాయి.ఝాన్సీ

ఆత్మహత్య కేసులో ట్విస్ట్: భర్తపై ఫిర్యాదు చేస్తూ కెసిఆర్‌కు లేఖఆత్మహత్య కేసులో ట్విస్ట్: భర్తపై ఫిర్యాదు చేస్తూ కెసిఆర్‌కు లేఖ

మీడియాలో వచ్చిన వార్తాకథనాలు సంచలనాత్మకంగా ఉన్నాయి. ఝాన్సీరాణి రాసిన లేఖలోని వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం నోములకి చెందిన గుర్రపు పద్మ తన భర్త మరణం తర్వాత కుమార్తె ఝాన్సీరాణి, కుమారుడితో కలిసి నకిరేకల్‌లోని మూసీ రోడ్డులో నివాసం ఉంటోంది.

నల్లగొండ మండలం దీపకుంటకి చెందిన ఝాన్సీ మేనబావ విజయేందర్‌ నుంచి పద్మ రూ.4 లక్షలు అప్పు తీసుకుంది. ఆ అప్పు తీర్చాలంటూ విజయేందర్‌ తరచూ పద్మ ఇంటికి వచ్చేవాడు. ఆ సమయంలో ఝాన్సీ పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. 'నీ కూతురును ఇచ్చి పెళ్లి చేస్తే... మాఫీ చేస్తా' అని చెప్పాడు. దాంతో పద్మ తన కూతురు ఝాన్సీకి చెప్పకుండానే పెళ్లికి అంగీకరించింది.

Another twist in BTech student Jhansi death case

నిరుడు 2014 ఆగస్టు 22న విజేందర్‌తో ఝాన్సీనికి ఇష్టం లేని పెళ్లి చేశారు. భర్తతో ఝాన్సీ కాపురం చేస్తున్న క్రమంలో తన తల్లికి, భర్తకు మధ్య ఉండకూడని సంబంధం ఉన్నట్లు గుర్తించింది. తన సోదరుడు ఇంట్లో లేనప్పుడు విజేందర్‌ తరచూ తల్లి దగ్గరికి వస్తున్నట్లు ఆమెకుతెలిసింది. తన తల్లితో విజయేందర్‌ అత్యంత సన్నిహితంగా ఉండడాన్ని కూడా గమనించింది.
విజేందర్‌తో కలిసి ఉండలేనని, విడాకులు తీసుకుంటానని ఝాన్సీ తల్లితో పోరు పెట్టింది. అయినా తల్లి వినలేదు. భర్త విజేందర్‌ కూడా అంగీకరించలేదు. 'రూ.20 లక్షలు చెల్లిస్తే విడాకులు ఇస్తా' అని చెప్పాడు. అంతేకాకుండా, తనతో సెక్స్‌కు అంగీకరించకపోతే వ్యభిచార గృహానికి అమ్మేస్తానంటూ బెదిరించడం ప్రారంభించాడు.

భర్తకు తల్లి పూర్తిగా మద్దతు ఇస్తూ వచ్చింది. ఈ వేధింపులను తట్టుకోలేక ఝాన్సీ హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటూ నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుకుంది. ఈనెల 28న పరీక్షలు ముగిశాయి. 'మేం వస్తున్నాం. నిన్ను తీసుకెళతాం' అంటూ తల్లి, భర్త నుంచి ఫోన్‌ వచ్చింది. వాళ్లు తనను ఎక్కడికి తీసుకెళతారోనని ఝాన్సీ ఆందోళన చెందింది. చంపేస్తారేమోనని కూడా అనుమానం వ్యక్తం చేసింది. భర్తపై చర్యలు తీసుకోవాలంటూ ఈనెల 23న డీజీపీ, నల్లగొండ ఎస్పీ, నల్లగొండ జిల్లా జడ్జి, నకిరేకల్‌ ఎస్‌ఐలకు లేఖలు రాసింది.

ఝాన్సీ రాసిన లేఖ ఈ నెల 28న పోలీసులకు అందింది. అయితే, ఈ నెల 24వ తేదీన్నే ఝాన్సీరాణి ఆత్మహత్య చేసుకుంది. ఝాన్సీ రాసినట్లుగా చెబుతున్న లేఖలోని సంతకాన్ని, కళాశాలలోని రికార్డుల్లో ఉన్న సంతకాలతో పరిశీలిస్తామని సిఐ వెంకటేశ్వర రావు చెప్పారు. ఝాన్సీ భర్త విజయేందర్‌రెడ్డి, తల్లి పద్మపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

పోలీసులకు రాసిన లేఖలో ఝాన్సీ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చెప్పలేదు. దీంతో ఝాన్సీది హత్యా, ఆత్మహత్యా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

English summary
More details coming out in BTech girl student Jhanshi's death case at Nomula village of Nalgonda district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X