హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జాబ్ మేళా పేరుతో భారీ మోసం: ఉప్పల్‌లో ఉద్రిక్తత, ఫర్నీచర్ ధ్వంసం

ఉద్యోగాల పేరిట దాదాపు అయిదు వేల మందిని మోసం చేసిన సంఘటన హైదరాబాదులోని ఉప్పల్‌లో చోటు చేసుకుంది. జరిగిన మోసం తెలిసిన నిరుద్యోగులు కాలేజీ పైన దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉద్యోగాల పేరిట దాదాపు అయిదు వేల మందిని మోసం చేసిన సంఘటన హైదరాబాదులోని ఉప్పల్‌లో చోటు చేసుకుంది. జరిగిన మోసం తెలిసిన నిరుద్యోగులు కాలేజీ పైన దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

అద్వితీయ శ్రేయ ఫౌండేషన్, గెట్ మై జాబ్స్ డాట్ కామ్ ఆధ్వర్యంలో ఉప్పల్‌లోని ఓ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆన్ లైన్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిరుద్యోగుల నుంచి రూ.200 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేశారు. 40 ఎంఎన్‌సీ కంపెనీలు, ఇతర కంపెనీలు వస్తాయని చెప్పారు.

<strong>అది తెలిసి టెక్కీ సునీత ఆత్మహత్య: ఓ అమ్మాయితో నిందితుడి కాపురం</strong>అది తెలిసి టెక్కీ సునీత ఆత్మహత్య: ఓ అమ్మాయితో నిందితుడి కాపురం

Aspirants accuse job fair organisers of cheating

ఆదివారం ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ కాలేజీలో జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరయ్యారు. కానీ అక్కడకు చేరుకున్న నిరుద్యోగులకు షాక్ తగిలింది.

అక్కడ అలాంటి పరిస్థితి ఏమీ కనిపించలేదు. దీంతో అక్కడి యాజమాన్యాన్ని నిలదీశారు. నిరుద్యోగులు ఆగ్రహంతో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. కాలేజీ యాజమాన్యం పోలీసులను సంప్రదించింది.

పోలీసులు మాట్లాడుతూ.. ఉప్పల్ జాబ్ మేలా బాధ్యుల పైన కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో చూసి నిరుద్యోగులు మోసపోవద్దని హితవు పలికారు. నిందితుల పైన చర్యలు తీసుకుంటామన్నారు.

English summary
Aspirants accuse job fair organisers of cheating in Hyderabad in Uppal on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X