హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ పోలీసింగ్ భేష్: యూకే, ఆస్ట్రేలియా పోలీస్ బృందం సందర్శన(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగర పోలీసింగ్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రశంసలు అందుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో హైదరాబాద్ నగర పోలీసులకు విదేశీ పోలీసుల కితాబు లభించింది.

టెక్నాలజీ సాయంతో నేరాల నివారణ, కేసుల దర్యాప్తు, ఉద్యోగుల మధ్య పని విభజనతో జవాబుదారీ తనం కల్పిస్తున్న పద్ధతులు భేష్షుగ్గా ఉన్నాయని బ్రిటన్, ఆస్ట్రేలియాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లోని సర్ధార్ వల్లబ్‌భాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో మిడ్ కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రాం పాల్గొనేందుకు వచ్చిన ఈ రెండు దేశాల పోలీసు ఉన్నతాధికారుల బృందం.. శనివారం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్‌స్టేషన్లను సందర్శించారు.

కమ్యూనిటీ సీసీ కెమెరా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, సందర్శకులకు సౌకర్యాలు, లాకప్‌, విచారణ గదులను పరిశీలించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. పోలీసు పెట్రోలింగ్‌ వాహనాలను పరిశీలించి వాటిలో సౌకర్యాలను తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లలో అమలు చేస్తున్న నూతన విధానాలను మధ్య మండలం డీసీపీ కమలాసన్‌రెడ్డి బృంద సభ్యులకు వివరించారు.

పోలీస్‌స్టేషన్లను సందర్శించిన వారిలో చీఫ్ సూపరింటెండ్ షూ విలియమ్స్, డిటెక్టివ్ సూపరింటెండెంట్ (వెస్ట్ మిడ్‌న్యాండ్స్ పోలీస్) బకాన్, క్వీన్స్‌ల్యాండ్ పోలీస్ సూపరింటెండెంట్ పౌల్ జీయబర్త్, విక్టోరియా పోలీస్ సూపరింటెండెంట్ డేవిడ్ క్లయేటన్, డిటెక్టివ్ సూపరింటెండెంట్ అర్తూర్ మెహిర్‌మెన్, సూపరింటెండెంట్ బ్రెట్ గ్రీన్ ట్రీ తదితరులు ఉన్నారు.

పోలీస్ బృందం

పోలీస్ బృందం

హైదరాబాద్‌ నగర పోలీసింగ్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రశంసలు అందుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో హైదరాబాద్ నగర పోలీసులకు విదేశీ పోలీసుల కితాబు లభించింది.

పోలీస్ బృందం

పోలీస్ బృందం

టెక్నాలజీ సాయంతో నేరాల నివారణ, కేసుల దర్యాప్తు, ఉద్యోగుల మధ్య పని విభజనతో జవాబుదారీ తనం కల్పిస్తున్న పద్ధతులు భేష్షుగ్గా ఉన్నాయని బ్రిటన్, ఆస్ట్రేలియాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.

పోలీస్ బృందం

పోలీస్ బృందం

హైదరాబాద్‌లోని సర్ధార్ వల్లబ్‌భాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో మిడ్ కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రాం పాల్గొనేందుకు వచ్చిన ఈ రెండు దేశాల పోలీసు ఉన్నతాధికారుల బృందం.. శనివారం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్‌స్టేషన్లను సందర్శించారు.

పోలీస్ బృందం

పోలీస్ బృందం

కమ్యూనిటీ సీసీ కెమెరా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌, సందర్శకులకు సౌకర్యాలు, లాకప్‌, విచారణ గదులను పరిశీలించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. పోలీసు పెట్రోలింగ్‌ వాహనాలను పరిశీలించి వాటిలో సౌకర్యాలను తెలుసుకున్నారు.

పోలీస్ బృందం

పోలీస్ బృందం

పోలీస్‌స్టేషన్‌లలో అమలు చేస్తున్న నూతన విధానాలను మధ్య మండలం డీసీపీ కమలాసన్‌రెడ్డి బృంద సభ్యులకు వివరించారు.

English summary
A team of Australian police personnel, who were in the city, studied the policing system in Hyderabad, and the initiatives taken by the city police, on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X