వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనంతో మమేకం కావాలి.. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలి :కెసిఆర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రెండున్నర ఏళ్ళ టిఆర్ ఎస్ పాలనకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్టుగా ఓ సర్వే పలితాలు వెల్లడించాయి.అయితే ఈ సర్వే ఫలితాల తో మరింతగా ప్రజల్లోకి వెళ్ళేందుకు ఆ పార్టీ సన్నద్దమౌతోంది. ప్రజల మద్యే నిత్యం ఉండాలని టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో మినహా హైద్రాబాద్ కు రాకూడదని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది. దేశంలోనే ఏ ప్రభుత్వం కూడ 30 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం లేదనే విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళాలని పార్టీ క్యాడర్ కు కెసిఆర్ సూచించారు.కెసిఆర్ పాలన పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలిన విషయాన్ని కెసిఆర్ పార్టీ నాయకుల వద్ద ప్రస్తావిస్తున్నారు.ఈ సర్వే ఆదారంగా చేసుకొని మరింతగా ప్రజల్లోకి వెళ్ళేలా ప్లాన్ చేసుకోవాలని ఆయన సూచించారు.

avalible to serve the people ..trs chief

అనవసరంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారని...విపక్షాల విమర్శలకు ఆధారాలతో తగిన బుద్ది చెప్పాలని కెసిఆర్ పార్టీ క్యాడర్ కు సూచించారు.నియోజకవర్గాలు, జిల్లాల్లోనే ఎక్కువ కాలం గడపాలని కెసిఆర్ ప్రజా ప్రతినిధులకు సూచించారు.ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే చర్యలను తీసుకోవాలని ప్రజా ప్రతినిధులను కోరారు.

ప్రజలతో ఎలా మెలగాలి....రాష్ట్రంలోని ఏ ప్రజా ప్రతినిధి ప్రజలతో మమేకమయ్యారు...ఎవరూ దూరంగా ఉంటున్నారనే విషయాన్ని సర్వే తేల్చడంతో ....ఈ సర్వే ఆదారంగా ప్రజలకు దూరంగా ఉంటున్న ప్రజా ప్రతినిధులకు కెసిఆర్ కొన్ని సలహాలు ఇచ్చారు. ప్రజలతో సన్నిహితంగా ఉండాలని సూచించారు.స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులపై ప్రజలు అక్కడక్కడ అసంతృప్తితో ఉన్న విషయాన్ని గమనించిన...అధినేత వారిని హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు ప్రజలకు అందేలా ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు.

English summary
trs chief kcr ordered to their party workers to solve people problems. if leave local district constancy in emergency only.party mps, mlas ,ministers invite to implement govt schemes.some mlas performance not happy to kcr
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X