హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిసిహెచ్‌లో సాఫ్ట్‌వేర్ ప్రారంభించిన బాలకృష్ణ(ఫొటో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సమాచార సేకరణ, క్రోడీకరణ కోసం ఆంకో కలెక్ట్ అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చింది. శుక్రవారం బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు.

 Balakrishna launches new software in Basavatarakam hospital

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సాఫ్ట్‌వేర్‌తో దేశ వ్యాప్తంగా వచ్చే క్యాన్సర్ వ్యాధులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి, వర్గీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిన డాక్టర్ రమేష్ నిమ్మగడ్డను ఈ సందర్భంగా బాలకృష్ణ అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిఈఓ ఆర్పీ సింగ్, సిఓఓ సత్యనారాయణ, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ, మెడికల్ అంకాలజీ విభాగధిపతి డాక్టర్ సెంథిల్ రాజప్ప తదితరులు పాల్గొన్నారు.

English summary
Basavatarakam Indo American Cancer Hospital Chairman Nandamuri Balakrishna on Friday launched new software in hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X