హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ చెప్పారు: టీ మంత్రులకు హైద్రాబాద్‌పై హామీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దటంతో పాటు తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శనివారం అన్నారు.

దిల్‌కుషా అతిథి గృహంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అబ్కారీ మంత్రి పద్మారావులతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. నగరంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల పైన సమీక్షించారు. విద్య, ఉపాధి, వైద్యం, పారిశ్రామిక అభివృద్ధికి హైదరాబాద్ చిరునామా కావాలని ఆకాంక్షించారు.

 బండారు దత్తాత్రేయ

బండారు దత్తాత్రేయ

అందరికీ ఉపాధి చూపే నగరంగా హైదరాబాదును విస్తరించడానికి ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై వారు చర్చించారు.

బండారు దత్తాత్రేయ

బండారు దత్తాత్రేయ

బంగారు తెలంగాణ సాధనకు కేంద్రం నుండి నిధులను తేవడానికి తనవంతు కృషి చేస్తానని మంత్రులకు దత్తాత్రేయ భరోసా ఇచ్చారు.

బండారు దత్తాత్రేయ

బండారు దత్తాత్రేయ

తెలంగాణతో పాటు ఏ రాష్ట్రం పైన అయినా కేంద్రం వివక్ష చూపబోదని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశానికి బలం చేకూరుతుందన్న ప్రధాని మోడీ మాటలను ఆయన గుర్తు చేశారు.

బండారు దత్తాత్రేయ

బండారు దత్తాత్రేయ


ప్రత్యేక పథకాల అమలుకు అవసరమైతే రాష్ట్ర మంత్రులను ఢిల్లీకి తీసుకు వెళ్లి అన్ని శాఖల మంత్రులతో సమావేశం అయ్యేలూ చూస్తానని దత్తాత్రేయ హామీ ఇచ్చారు.

English summary
Union Minister for Labour & Employment Shri Bandaru Dattaterya assured Telangana state Ministers and BJP floor leaders to bring more central funds for the new state development
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X